భార్య కోసం మెగాస్టార్ చిరు కవిత - సోషల్ మీడియాలో వైరల్
మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు. తన సమయాన్ని ఎక్కువగా సెట్స్‌లోనే గడిపేస్తుంటారు. కానీ ఫ్యామిలీకి కూడా తన సమయాన్ని కేటాయిస్తారు. అలా చిరంజీవి.. తన ఫ్యామిలీతో షేర్ చేసుకునే స్పెషల్ మూమెంట్స్ అన్నీ సోషల్ మీడియాలో బయటపెడుతుంటారు. తాజాగా తన భార్య సురేఖకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్‌ను తెలిపారు చిరు. ఒక చిన్న కవితతో భార్య సురేఖకు బర్త్ డే విషెస్ చెప్తూ.. మెగాస్టార్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. కవితతో పాటు తన భార్యతో దిగిన స్పెషల్ ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


మేజర్ ముకుంద్‌పై శివకార్తికేయన్ బయోపిక్ - స్పందించిన ఆఫీసర్ భార్య
తమిళ హీరో శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ ‘అమరన్‌’కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను, టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. రాజ్‌కుమార్ పెరియసామి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఈ టీజర్‌లో శివకార్తికేయన్ పాత్ర పేరు ముకుంద్ వీ అని టీజర్‌లో చూపించారు. దీన్ని బట్టి చూస్తే ‘అమరన్’ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ అని వార్తలు వచ్చాయి. తాజాగా ముకుంద్ వరదరాజన్ భార్య రెబెక్కా వర్గీస్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. తన భర్త జీవితంపై సినిమా రావడంపై ఆమె స్పందించారు. సినిమా చూడడానికి ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘లియో 2’పై లోకేష్ కనగరాజ్ పాజిటివ్ అప్‌డేట్ - అసలు ఏమన్నాడంటే?
తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘లియో’ గతేడాది మిక్స్‌డ్ టాక్‌తో కూడా భారీ విజయం అందుకుంది. ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’లో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ‘లియో’ క్లైమ్యాక్స్‌లో సీక్వెల్ ఉంటుందన్న హింట్ కూడా ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ కూడా ‘లియో 2’ ఉంటుందన్న విషయాన్ని గట్టిగానే చెప్పారు. కానీ విజయ్ పొలిటికల్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. మరొక్క సినిమా చేసి పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇస్తానని విజయ్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ఒక కామిక్ బుక్ ఈవెంట్లో పాల్గొన్న లోకేష్ కనగరాజ్‌కు ‘లియో 2’ ఉంటుందా? ఉండదా? అని ప్రశ్న ఎదురైంది. దీనికి లోకేష్ ‘విజయ్ లక్ష్యం వేరేగా ఉంది. లియో 2 పూర్తిగా సాధ్యమే. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి సినిమా చేస్తాను.’ అని సమాధానం ఇచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ధనుష్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ రెడీ - శేఖర్ కమ్ముల మూవీ కాదండోయ్!
ప్రస్తుతం మనదేశంలో ఉన్న వెర్సటైల్ యాక్టర్లలో తమిళ స్టార్ హీరో ధనుష్ ముందంజలో ఉంటారు. కమర్షియల్ సినిమాలతో పాటు కొత్త తరహా సినిమాలతో కూడా ధనుష్ ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటారు. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా అనేక ఇతర భాషల్లో కూడా ధనుష్ సినిమాలు చేశారు. హిట్లు కూడా కొట్టారు. ఏకంగా హాలీవుడ్‌లో కూడా ధనుష్ సినిమా చేశారు. ధనుష్ కేవలం నటుడు మాత్రమే కాదు. తన ప్రతి సినిమాలో ధనుష్ కనీసం ఒక్క పాట అయినా పాడతారు. సినిమాలు కథలు కూడా రాస్తారు. అంతే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తారు. 2017లో వెటరన్ నటుడు రాజ్ తరుణ్ హీరోగా ‘పవర్ పాండీ’ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కూడా అయింది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ధనుష్ రెండో సినిమా దర్శకత్వం వహించారు. దీనికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


సాయి ధరమ్ తేజ్ ‘గాంజా శంకర్’ టీమ్‌కు నోటీసులు - చట్టపరమైన చర్యలు తప్పవంటూ వార్నింగ్
సినిమాలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. తాజాగా సాయి ధరమ్ తేజ్ సినిమాకు కూడా అలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. ప్రస్తుతం ఈ మెగా హీరో.. దర్శకుడు సంపత్ నందితో కలిసి ‘గాంజా శంకర్’ అనే మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు నెలల క్రితం రిలీజ్ అయిన ఈ టైటిల్ గురించి ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. టైటిల్ మార్చాలి అంటూ మూవీ టీమ్‌కు నోటీసులు వచ్చాయి. ఈ నోటీసులపై మూవీ టీమ్ ఎలాంటి స్పందన ఇస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)