Singer Geetha Madhuri: ఆలస్యంగా గుడ్‌న్యూస్‌ చెప్పిన గీతామాధురి - బిడ్డ పుట్టిందని సర్‌ప్రైజ్‌ చేసింది

Singer Geetha Madhuri: టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ గీతా మాధురి గుడ్‌న్యూస్‌ చెప్పింది మరోసారి ఆమె తల్లయ్యారు. ఈ విషయాన్ని ఆలస్యంగా ఆమె ప్రకటించింది.

Continues below advertisement

Geetha Madhuri Blessed With Baby Boy: టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ గీతా మాధురి గుడ్‌న్యూస్‌ చెప్పింది మరోసారి ఆమె తల్లయ్యారు. ఈ విషయాన్ని ఆలస్యంగా ఆమె ప్రకటించింది. ఫిబ్రవరి 10న తనకు పండంటి మగబిడ్డ జన్మించినట్టు గీతా మాధురి శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక వెల్లిడించింది. "ఫిబ్రవరి 10న నాకు బాబు పుట్టాడు. ఈ సందర్భంగా మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ షేర్‌ చేసింది. అయితే కొడుకు పుట్టిన విషయాన్ని ఆమె ఆలస్యంగా ప్రకటించడం గమనార్హం.

Continues below advertisement

ఈ విషయం తెలిసి ఆమె తోటి సింగర్స్‌, నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫ్ఆయన్స్‌, నెటిజన్లు నుంచి గీతా మాధురి దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా ఇటీవల గీతామాధురి సీమంతం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఆమె సీమంతం ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే గీతా మాధురి టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలకు పాటలు పాడి తన గాత్రంతో అలరించారు. లవ్ సాంగ్స్, మాస్ సాంగ్స్, డివోషనల్ పాటలు పాడి ఎంతో అభిమానులను సంపాదించుకున్నారు. గీతామాధురి పాటలకు.. ఆమె గాత్రానికి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది.

Also Read: 'ఈరోజు చావు నుంచి తప్పించుకున్నా'- రష్మిక షాకింగ్ పోస్ట్, టెన్షన్ లో ఫ్యాన్స్?

కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో ఎన్నో సాంగ్స్ ఆలపించింది. తను పాడిన ప్రతి పాట కూడా హిట్‌, బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచాయి. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకున్నాయి. ఇప్పటికీ గీతామాధురి పాడిన పాటలు ఏదోక సందర్భంలో ఎక్కడో ఒక చోట వింటూనే ఉన్నాం. అయితే కొంతకాలంగా ప్రెగ్నెంట్‌ కారణంగా గీతా మాధురి ప్రెఫెషనల్‌ వర్క్‌కు దూరంగా ఉన్నారు. ఇకపోతే సింగర్ గీతామాధురి, నటుడు నందులు 2014లో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు మొదటిసారిగా 2019లో తల్లిదండ్రులు అయ్యారు. వీరికి ముందుగా ఆడపిట్ట జన్మించగా పాపకు దాక్షాయణి ప్రకృతి అని నామకరణం చేశారు.

కొద్ది రోజుల క్రితం ఆమె సీమంతం వేడుకను గ్రాండ్‌గా నిర్వహించాడు ఆమె భర్త నందు. అలాగే ఇటీవల బిడ్డపుట్టబోతున్న సందర్భంగా నందు దాదాపు 800 మందికి ఇటీవల అన్నదానం నిర్వహించాడు. ఇక ప్రస్తుతం కెరీర్‌ పరంగా కాస్తా బ్రేక్‌ తీసుకుంది గీతా మాధురి. ఇక నందు మాత్రం పలు చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, టీవీ హోస్ట్‌గా రాణిస్తున్నాడు. ఓ వైపు సినిమాల్లో హీరోగా చేస్తూనే మరోవైపు స్పోర్ట్స్‌ యాంకర్‌, టెలివిజన్‌ హోస్ట్‌, ఓటీటీ యాక్టర్‌గా ఫుల్‌ బిజీ అయిపోయడు. కొడుకు పుట్టడంతో ఈ సెలబ్రిటీ జంట ప్రస్తుతం ఆనందోత్సాహంలో ఉన్నారు. బిడ్డతో సమాయాన్ని గడుపుతున్నారు. 

Continues below advertisement