Rashmika Mandanna : గత ఏడాది 'యానిమల్' మూవీతో మరో పాన్ ఇండియా హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో రష్మిక యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన అభిమానులతో నిత్యం సోషల్ మీడియాలో టచ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్లతో చిట్ చాట్ కూడా చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ షాకింగ్ గా మారింది. తాను చావు నుంచి తృటిలో తప్పించుకున్నాను అంటూ ఆ పోస్టులో పేర్కొనడంతో ఆమె అభిమానులు అసలేం జరిగిందో అని తెగ టెన్షన్ పడిపోతున్నారు. దీంతో రష్మిక షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఈ రోజు చావు నుంచి తప్పించుకున్నాము - రష్మిక మందన
రష్మిక మందన తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో మరో హీరోయిన్ శ్రద్ధదాస్ తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ.." మీ సమాచారం కోసం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. ఈరోజు మేము చావు నుంచి తప్పించుకున్నాం" అంటూ తమ కాళ్ళు చూపిస్తూ ఓ ఫోటోని షేర్ చేసింది. రష్మిక పెట్టిన ఈ పోస్టుకు అర్థం ఏంటో తెలియని ఫ్యాన్స్ చావు నుంచి తప్పించుకున్నాం అనే కామెంట్ చూసి కంగారు పడుతున్నారు. ఈ ఫోటోను చూస్తే శ్రద్ధదాస్ తో రష్మిక జర్నీలో లో ఉన్నట్లు అర్థమవుతుంది. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుంది ఏమో అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అటు శ్రద్ధా దాస్ కూడా సేమ్ ఇదే పోస్ట్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో రష్మిక ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటూ రష్మిక పోస్ట్ పై కామెంట్స్ పెడుతున్నారు.
రష్మిక ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
రష్మిక తో పాటు శ్రద్ధాదాస్ ప్రయాణిస్తున్న ఎయిర్ విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఫ్లైట్ ముంబై నుంచి హైదరాబాద్ వెళుతుండగా అనుకోని సాంకేతిక సమస్యల కారణంగా సుమారు 30 నిమిషాల తర్వాత మళ్లీ ముంబైకి చేరుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని సమాచారం. ఇదే విషయాన్ని రష్మిక తన సోషల్ మీడియాలో పంచుకుంది.
2024 లో ఏకంగా నాలుగు సినిమాలు
రష్మిక మందన ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాల లైన్లో పెట్టింది. అందులో రెండు టాలీవుడ్ నుంచి రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. 'యానిమల్' సక్సెస్ తో రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం 'పుష్ప 2', 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంది. వీటిలో 'పుష్ప2' షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగస్టు 15న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 'పుష్ప2' కనుక సక్సెస్ అయితే రష్మిక క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకోవడం ఖాయం.
Also Read : ‘గామి’ టీజర్ చూసిన ప్రభాస్ - రియాక్షన్ ఏంటంటే?