నా సామి రంగ టైటిల్ సాంగ్ - నాటు నాటు టీంను రిపీట్ చేసిన నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా 'నా సామి రంగ'. 'అల్లరి' నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. సెంబర్ 31న ఉదయం 'నా సామి రంగ' రిలీజ్ డేట్ చెబితే... సాయంత్రం టైటిల్ సాంగ్ విడుదల చేశారు. 'మా జోలికొస్తే... మాకడ్డు వస్తే... మామూలుగా ఉండదు నా సామి రంగ' అంటూ సాంగ్ సాగింది. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే... 'నాటు నాటు' కాంబోను రిపీట్ చేయించారు నాగార్జున. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


గోపీచంద్ సినిమాకు 'వెంకీ' కామెడీ టచ్ - ఇంట్రెస్టింగ్ మేటర్ రివీల్ చేసిన శ్రీను వైట్ల
కమర్షియల్ విలువలు మిస్ కాకుండా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమాలు తీసే దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు. ఆయన తీసిన సినిమాల్లో మాస్ మహారాజా రవితేజ 'వెంకీ' చిత్రానిది ప్రత్యేక స్థానం. అందులో ట్రైన్ జర్నీ కామెడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూసే కామెడీ సీన్లలో ఆ ట్రైన్ ఎపిసోడ్ తప్పకుండా ఉంటుంది. 'వెంకీ' రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లలో ఆ ట్రైన్ కామెడీ సీన్ వచ్చినప్పుడు రెస్పాన్స్ అదిరింది. అది షేర్ చేసిన శ్రీను వైట్ల... ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తాను దర్శకత్వం వహిస్తున్న సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ రివీల్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఒకే థియేటర్లలో 5 లక్షల డాలర్లు వసూలు, ఓవర్సీస్ లో ‘యానిమల్‘ సరికొత్త రికార్డు
రణ్‌బీర్‌ కపూర్ హీరోగా న‌టించిన తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ‘యానిమల్‘ మూవీ ఓవర్సీస్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. టొరంటోలోని సిల్వర్ సిటీ బ్రాంప్టన్ సినిమాస్ లో ఏకంగా 5 లక్షల డాలర్ల గ్రాస్ వసూళు చేసింది. భారత కరెన్సీలో సుమారు రూ. 4 కోట్ల 16 లక్షలు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఓ భారతీయ సినిమా ఒకే థియేటర్ లో ఇంత మొత్తం వసూళు చేయడం ఇదే తొలిసారి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


సంక్రాంతికి 'నా సామిరంగ' - రిలీజ్ డేట్ చెప్పిన నాగ్, సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
'ది ఘోస్ట్' మూవీ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అక్కినేని నాగార్జున, ‘నా సామిరంగ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన బిన్నీ, ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. నాగార్జున సరసన హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎండింగ్ కు వచ్చాయి. ఈ మూవీని జనవరి 14, 2024న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


మాది ‘ఆదిపురుష్‘ కాదు, ఓం రౌత్ వీఎఫ్ఎక్స్‌పై ‘కల్కి‘ ఎడిటర్ సెటైర్లు
ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 AD‘ అనే సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ’కల్కి 2898 AD’ చిత్ర ఎడిటర్ విశాల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో VFX వర్క్స్ గురించి మాట్లాడిన ఆయన, ఓం రౌత్ ‘ఆదిపురుష్’ VFX మీద సెటైర్లు విసిరారు. ఇన్ స్టాలో తన ఫాలోవర్స్ ఇంటరాక్ట్ అయిన ఆయన, “గత VFX సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో VFX పనితీరు ఎలా ఉంది? ఎమైనా మెరుగుదల కనిపిస్తుందా? అని ఓ ఫాలోవర్ ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన విశాల్ ‘ఆదిపురుష్’ VFXపై విమర్శలు చేశారు. " గత 10 సంవత్సరాలుగా VFX మీద రీసెర్చ్ చేస్తున్నాం. ‘అవతార్’, ‘అవెంజర్స్’ లాంటి సినిమాల VFXను సైతం పరిశీలించాం. దీని ఫలితాన్ని ‘కల్కి’లో చూస్తాము. ఇది మీ ‘ఆదిపురుష్’ కాదు" అని చెప్పుకొచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)