కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా 'నా సామి రంగ'. 'అల్లరి' నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ రోజు విడుదల తేదీ వెల్లడించారు. 


జనవరి 14న 'నా సామి రంగ' విడుదల
Naa Saami Ranga Release Date: 'నా సామి రంగ' చిత్రాన్ని 2024 సంక్రాంతి బరిలో విడుదల చేస్తామని సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇవాళ విడుదల తేదీ వెల్లడించారు. జనవరి 14న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకు వస్తామన్నారు. 


మా జోలికొస్తే... మాకడ్డు వస్తే... మామూలుగా ఉండదు
Naa Saami Ranga title song: డిసెంబర్ 31న ఉదయం 'నా సామి రంగ' రిలీజ్ డేట్ చెబితే... సాయంత్రం టైటిల్ సాంగ్ విడుదల చేశారు. 'మా జోలికొస్తే... మాకడ్డు వస్తే... మామూలుగా ఉండదు నా సామి రంగ' అంటూ సాంగ్ సాగింది. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే... 'నాటు నాటు' కాంబోను రిపీట్ చేయించారు నాగార్జున. 






'నాటు నాటు' సాంగ్ వెనుక ఉన్న వాళ్ళందరూ...
'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు...' పాటకు ప్రపంచమంతా స్టెప్పులు వేసింది. ఏకంగా తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ అవార్డు తీసుకు వచ్చింది. ఆ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా... చంద్రబోస్ రాశారు. కీరవాణి తనయుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాటను ఆలపించారు. యాజ్ ఇట్ ఈజ్... ఇప్పుడు వీళ్ళందరూ 'నా సామి రంగ' టైటిల్ సాంగ్ రూపొందించారు.


Also Read: గోపీచంద్ సినిమాకు 'వెంకీ' కామెడీ టచ్ - ఇంట్రెస్టింగ్ మేటర్ రివీల్ చేసిన శ్రీను వైట్ల



'నా సామి రంగ'లో నాగార్జున సరసన కన్నడ భామ ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. తెలుగు ఆమెకు రెండో చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్'తో తెలుగు తెరకు ఆమె పరిచయం అయ్యారు. కొన్ని రోజుల క్రితం నాగార్జున, ఆషికాపై తీసిన 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది' పాటను విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది. 


Also Readముట్టుకోవద్దని చెప్పాను కదరా... ప్రభాస్‌ను వాడుకున్న పోలీసులు



'నా సామి రంగ' చిత్రానికి బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. 'పలాస' దర్శకుడు కరుణ కుమార్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సాహిత్యం: చంద్రబోస్, సంగీతం: ఎంఎం కీరవాణి, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి. నిర్మాణ సంస్థ: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, దర్శకత్వం: విజయ్ బిన్నీ.