కమర్షియల్ విలువలు మిస్ కాకుండా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమాలు తీసే దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు. ఆయన తీసిన సినిమాల్లో మాస్ మహారాజా రవితేజ 'వెంకీ' చిత్రానిది ప్రత్యేక స్థానం. అందులో ట్రైన్ జర్నీ కామెడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూసే కామెడీ సీన్లలో ఆ ట్రైన్ ఎపిసోడ్ తప్పకుండా ఉంటుంది. 'వెంకీ' రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లలో ఆ ట్రైన్ కామెడీ సీన్ వచ్చినప్పుడు రెస్పాన్స్ అదిరింది. అది షేర్ చేసిన శ్రీను వైట్ల... ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తాను దర్శకత్వం వహిస్తున్న సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ రివీల్ చేశారు.
గోపీచంద్ సినిమాలోనూ ట్రైన్ జర్నీ ఎపిసోడ్
గోపీచంద్ (Gopichand) కథానాయకుడిగా చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా వేణు దోనెపూడి ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఆ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. అందులో కూడా ట్రైన్ జర్నీ ఎపిసోడ్ ఒకటి ఉందని వెంకీ రీ రిలీజ్ సందర్భంగా శ్రీను వైట్ల చెప్పారు.
Also Read: పాపం కోలీవుడ్ స్టార్ విజయ్... దళపతిని బామ్మ గుర్తు పట్టలేదు
గోపీచంద్ కామెడీ టైమింగ్ సూపర్ ఉంటుంది. హీరోలతో పాటు మిగతా ఆర్టిస్టుల నుంచి కామెడీ రాబట్టుకోవడంలో శ్రీను వైట్ల స్పెషలిస్ట్. మరి, గోపీచంద్ 32లో ఆయన ఎటువంటి ఎపిసోడ్ డిజైన్ చేశారో మరి. వెయిట్ అండ్ సి.
సినిమా టైటిల్ 'విశ్వం' అని ఖరారు చేశారా?
Gopichand 32 movie title: గోపీచంద్, శ్రీను వైట్ల కలయికలో మొదటి చిత్రమిది. ఈ చిత్రానికి 'విశ్వం' టైటిల్ ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే... ఆ మాటను చిత్ర బృందం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. గోపీచంద్ సినిమా చివర సున్నా వస్తే హిట్ అనే సెంటిమెంట్ ఉంది. అలా టైటిల్స్ ఉన్న సినిమాల్లో ఒకట్రెండు ఆశించిన విజయాలు అందుకోలేదు. కానీ, మెజారిటీ సినిమాలు హిట్ అయ్యాయి.
Also Read: ముట్టుకోవద్దని చెప్పాను కదరా... ప్రభాస్‌ను వాడుకున్న పోలీసులు
కథానాయికగా కావ్యా థాపర్... స్క్రీన్ ప్లే రాసిన గోపీ మోహన్!
శ్రీను వైట్ల తాజా సినిమాలో గోపీచంద్ సరసన కావ్యా థాపర్ కథానాయికగా యాక్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రముఖ రచయిత గోపీ మోహన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు ఆయన రైటింగ్ విభాగంలో పని చేశారు. శ్రీను వైట్ల తీసిన సూపర్ హిట్ సినిమాలు 'వెంకీ', 'ఢీ', 'దుబాయ్ శీను' చిత్రాలకు గోపీ మోహన్ స్క్రీన్ ప్లే అందించడమే కాదు... 'రెడీ', 'కింగ్', 'నమో వేంకటేశ', 'బ్రూస్ లీ' చిత్రాలకు కథలు సైతం అందించారు. గోపీచంద్ హీరోగా నటించిన 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలకు కూడా పని చేశారు.
Also Read: పుష్ప 2 ఫస్ట్ నైట్ - యూట్యూబ్‌లో వైరల్ అవుతోన్న షార్ట్ ఫిల్మ్
'ఆర్ఎక్స్ 100', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం', 'మన్మథుడు 2', 'వినరో భాగ్యము విష్ణు కథ'తో పాటు కొన్ని చిత్రాలకు మంచి బాణీలు, నేపథ్య సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. త్వరలో ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలను వెల్లడిస్తామని నిర్మాత వేణు దోనెపూడి తెలిపారు.