Nellai Welcomes THALAPATHY: తమిళనాడులో దళపతి విజయ్ (Thalapathy Vijay) తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారా? అంటే... 'ఆ అవకాశమే లేదు' అని మరో సందేహం లేకుండా ఠక్కున సమాధానం చెబుతారు. కేవలం తమిళనాడులో మాత్రమే కాదు... తెలుగులోనూ విజయ్ మీద అభిమానం ఉన్న ప్రేక్షకులు ఎంతో మంది. అటువంటి దళపతిని ఓ బామ్మ గుర్తు పట్టలేదు.
అవును... బామ్మకు విజయ్ ఎవరో తెలియదు
వెండితెరపై మాత్రమే కాదు... నిజ జీవితంలోనూ తాను హీరో అని కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ మరోసారి నిరూపించుకున్నారు. తమిళనాడులోని తిరునెల్వేలి, టుటికోరియన్ జిల్లాల ప్రజలు వరదల కారణం ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రాంతాలకు వెళ్లిన విజయ్ ప్రజలకు రిలీఫ్ మెటీరియల్స్ ఇచ్చారు. వంటకు అవసరమైన సరుకులు అందజేశారు. సుమారు 800 కుటుంబాలకు ఆయన ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్స్ ఇచ్చినట్లు తెలిసింది.
తుఫాను, వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు 10 వేల రూపాయల నుంచి 50 వేలు అందజేశారని తెలిసింది. వరదల్లో ఇల్లు కొట్టుకుపోయిన ఓ ఫ్యామిలీ విజయ్ నుంచి చెక్ తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వరదల్లో కుటుంబ సభ్యుడిని కోల్పోయిన వాళ్ళకు విజయ్ లక్ష రూపాయలు అందజేశారట.
Also Read: ముట్టుకోవద్దని చెప్పాను కదరా... ప్రభాస్‌ను వాడుకున్న పోలీసులు
విజయ్ గొప్ప మనసుకు తమిళనాడు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. మరో వైపు రిలీఫ్ మెటీరియల్ తీసుకోవడానికి వేదిక మీదకు వెళ్ళిన బామ్మకు విజయ్ ఎవరో తెలియలేదు. అప్పుడు ఆమెను విజయ్ పిలిచారు. ఆ వీడియో క్యూట్ గా ఉందంటూ కొందరు షేర్ చేస్తున్నారు.
Also Read: బన్నీ పాట మహేష్‌కు... కుర్చీ మడతపెట్టి కాపీయే
సెల్ఫీల కోసమే వచ్చిన అభిమానులు
వరద బాధితులకు సాయం చేయడానికి విజయ్ తిరునెల్వేలి వెళితే... సెల్ఫీల కోసమే వచ్చిన కొందరు అభిమానులు సహాయక చర్యలకు అడ్డుతగిలారు. విజయ్ రిలీఫ్ మెటీరియల్ ఇవ్వబోతే... సెల్ఫీలు అడిగారు. ఆ తర్వాత రిలీఫ్ మెటీరియల్ తీసుకోకుండా వేదిక మీద నుంచి దిగారు.
Also Read: రంగస్థలం, సైరా to అగ్లీ స్టోరీ, శశివదనే - సినిమాటోగ్రాఫర్‌గా విజయనగరం కుర్రాడు