ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' - ఈసారి సంక్రాంతి మామూలుగా ఉండదు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఆల్రెడీ గ్లింప్స్ విడుదల చేశారు. అలాగని, సినిమా షూటింగ్ ఏమీ పూర్తి కాలేదు. అసలు, ఆ మాటకు వస్తే... ఇప్పటి వరకు జరిగిన షూటింగులో తీసింది కొంత మాత్రమే! మహా అయితే 25 శాతం కూడా పూర్తి అయ్యి ఉండదు. అందుకని, ముందుగా అనుకున్నట్లు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమా విడుదల కావడం కష్టమనే మాటలు ఫిల్మ్ నగర్, ట్రేడ్ వర్గాల్లో వినిపించింది. తాజా సమాచారం ఏమిటంటే... సంక్రాంతి సినిమా వస్తుందట! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


https://telugu.abplive.com/entertainment/cinema/pawan-kalyan-s-ustaad-bhagat-singh-to-release-before-andhra-pradesh-assembly-elections-107974


టాలీవుడ్‌లో ఈ నెల మూవీ జాతర - ఆగస్టులో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
టాలీవుడ్ లో ప్రతీనెలా ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఈ ఏడాది టాలీవుడ్ కి బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా బాగానే రిలీజ్ అయ్యాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ మూవీ రిలీజ్ అయి మంచి హిట్ ను అందుకుంది. ఇప్పుడు ఆగస్టు వంతు వచ్చేసింది. ఈ నెలలో కూడా టాలీవుడ్ లో చిన్న సినిమాలతో పాటు పెద్ద హీరోల సినిమాలు కూడా రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


గ్యాప్ వచ్చింది - జోడీ సెట్ చేసుకోడానికి వచ్చా: ‘నీతోనే డ్యాన్స్’ షోలో నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి పరిచయం అవసరం లేని పేరు. ‘జాతి రత్నాలు’ సినిమా ద్వారా సెన్సేషనల్ హిట్ అందుకున్నటువంటి నవీన్ పోలిశెట్టి త్వరలోనే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. యువి క్రియేషన్స్ బ్యానర్లో అనుష్క నవీన్ పోలిశెట్టి నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఓటీటీలో రికార్డులు బద్దలుకొడుతున్న ‘సామజవరగమన’ - 72 గంటల్లో అంత మంది చూసేశారా?
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా గత కొన్నేళ్లలో చాలావరకు తగ్గిపోయింది. ఈరోజుల్లో తక్కువ బడ్జెట్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. అసలు బాక్సాఫీస్ దగ్గర తక్కువ బడ్జెట్ సినిమాలు సృష్టిస్తున్న వండర్స్ చూస్తుంటే స్టార్ ప్రొడ్యూసర్సే ఆశ్చర్యపోతున్నారు. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, దర్శకుడికి ఇది డెబ్యూ సినిమానా, ఇలాంటి తేడాలు ఏమీ లేకుండా కంటెంట్ నచ్చితే చాలు.. ప్రేక్షకులు సినిమాను సూపర్‌ డూపర్ హిట్ చేస్తున్నారు. 2023లో అలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి విడుదలయిన తర్వాత కలెక్షన్లను కొల్లగొట్టిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ‘సామజవరగమన’. ఈ సినిమా కేవలం థియేటర్లలో మాత్రమే కాదు.. ఓటీటీలో కూడా తన సత్తా చాటుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


హృతిక్ రోషన్ కల్ట్ క్లాసిక్ 'కోయి మిల్ గయా' రీ రిలీజ్ - ఎప్పుడంటే?
హృతిక్ రోషన్ హీరోగా అతని తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన 'కోయి మిల్ గయా' సినిమా బాలీవుడ్ లో ఓ కల్ట్ క్లాసిక్ మూవీ గా నిలిచింది. 2003వ సంవత్సరంలో ఆగస్టు నెలలో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఆగస్టు 8, 2023 నాటికి ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  ఇండియాలోని 30 ప్రధాన నగరాల్లోని PVR ఐనాక్స్ లో ఆగస్టు 4న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాను మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత బిగ్ స్క్రీన్ పై విడుదల చేసి ప్రేక్షకులో మళ్లీ అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)