Tollywood Movies in August: టాలీవుడ్ లో ప్రతీనెలా ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఈ ఏడాది టాలీవుడ్ కి బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా బాగానే రిలీజ్ అయ్యాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ మూవీ రిలీజ్ అయి మంచి హిట్ ను అందుకుంది. ఇప్పుడు ఆగస్టు వంతు వచ్చేసింది. ఈ నెలలో కూడా టాలీవుడ్ లో చిన్న సినిమాలతో పాటు పెద్ద హీరోల సినిమాలు కూడా రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో విడుదల అయ్యే సినిమాల లిస్ట్ ఏంటో ఓ లుక్ వేసేయండి..


1. జైలర్


సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న మూవీ ‘జైలర్’. ఈ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహించారు. తమన్నా మూవీలో హీరోయిన్ గా నటించింది. అలాగే మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్య కృష్ణన్ తదితరులు నటించారు. ఈ మూవీ ఆగస్టు 10 న విడుదల కు సిద్దంగా ఉంది. 


2. భోళా శంకర్


మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘భోళా శంకర్’ సినిమా ఈ నెలలోనే విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీకు మెహర్ రమేష్ దర్వకత్వం వహించారు. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించారు. ఆగస్ట్ 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. 


3. ఉస్తాద్


కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన కథలను ఎంచుకొని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీసింహ. ఆయన హీరోగా వస్తోన్న మరో చిత్రం ‘ఉస్తాద్’. ఈ మూవీకు ఫణిదీప్ దర్శకుడు కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా ఆగస్టు 12న థియేటర్లలో విడుదల కానుంది.


4. ప్రేమ్ కుమార్


హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు హీరో సంతోష్ శోభన్. ఆయన నుంచి రాబోతున్న మరోమూవీ ‘ప్రేమ్ కుమార్’. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకు అభిషేక్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 18 న విడుదల కానుంది. 


5. మిస్టర్ ప్రెగ్నెంట్


బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈయన నుంచి రాబోతున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రగ్నెంట్’. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న  ఈ మూవీకు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కూడా ఆగస్టు 18 న విడుదల కానుంది. 


6. ఆదికేశవ


మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తోన్న సినిమా ‘ఆదికేశవ్’. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ ఎన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కూడా ఆగస్టు 18 న విడుదల కానుంది. 


7. పెద్ద కాపు-1


అఖండ మేకర్స్ ద్వారకా క్రియేషన్స్ నుంచి రాబోతున్న మూవీ ‘పెద్ద కాపు 1’. ఈ మూవీలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్నారు.  టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 18 న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీత అందిస్తున్నారు.


8. కింగ్ ఆఫ్ కోథా


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నుంచి రాబోతున్న మూవీనే ఈ ‘కింగ్ ఆఫ్ కోత’. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. అభిలాష్ జోషి దర్శకుడు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌ లో రాబోతున్న ఈ మూవీ ఆగస్టు 18 న విడుదల కానుంది.  


9. గాంఢీవధారి అర్జున


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న మూవీ ‘గాంఢీవధారి అర్జున’. ఈ మూవీకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఆగస్టు 25న విడుదలకు సిద్ధంగా ఉంది.


10. బెదురులంక 2012


ఇక ఆగస్టు నెల చివరిలో విడుదల అవుతోన్న చిత్రాల్లో ‘బెదురులంక 2012’ ఒకటి. ఈ మూవీలో కార్తికేయ హీరోగా నటిస్తున్నాడు. నేహా శెట్టి హీరోయిన్ గా కనిపించనుంది.ఈ సినిమాకు క్లాక్స్ దర్శకుడు. ఆగస్ట్ 25 న సినిమా విడుదల కానుంది.


11. బిజినెస్ మ్యాన్ (రీ రిలీజ్)


మహేష్ బాబు బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ‘బిజినెస్మెన్’ కూడా ఒకటి. ఈ మూవీలో మహేష్ నటన, యాటిట్యూట్, డైలాగ్స్, ఫైట్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. 2012 లో విడుదల అయిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీను మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9 న రీ రిలీజ్ చేయనున్నారు.


Also Read: శ్వక్ సేన్ 'నో' చెప్పిన విధానం నచ్చలేదు, ఆ వివాదంపై కీలక విషయాలు చెప్పిన 'బేబీ' డైరెక్టర్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial