Quotation Gang: ప్రస్తుత సినిమా రంగంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ప్రేక్షకులకు అంతగా ఎక్కేవి కావు అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలు మంచి కంటెంట్, విజువల్స్ తో వస్తున్నాయి. అందుకే క్రమేపీ ఈ సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఏర్పడుతోంది. ఇప్పటికే అలాంటి సినిమాలు రిలీజై మంచి హిట్ ను అందుకున్నాయి. కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే ‘కొటేషన్ గ్యాంగ్’. ఈ సినిమాలో నటి ప్రియమణి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో బాలీవుడ్ నటీనటులు జాకీషాఫ్, సన్నీ లియోన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు వివేక్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. 


కిరాయి హత్యలు చేసే గ్యాంగ్ వార్ నేపథ్యంలో..


నటి ప్రియమణి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడీ క్రైమ్ థ్రిల్లర్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఇక మూవీ ట్రైలర్ విషయానికొస్తే.. రీసెంట్ గానే మూవీ తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లో మొదట్నుంచీ హింసనే ఎక్కువగా చూపించారు. ఇది కిరాయి హత్యల గ్యాంగ్ లకు సంబంధించిన మూవీలా కనిపిస్తోంది. ఈ కథ అంతా చెన్నై, ముంబై, కశ్మీర్ ప్రాంతాల్లో జరిగే సంఘటనలతో సాగుతుందని తెలుస్తోంది. అయితే ఈ మూడు ప్రాంతాలకు ఈ కిరాయి గ్యాంగ్ లకు మధ్య లింక్ ఉన్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్ మొత్తం చంపుకోవడమే చూపించారు. మూవీ మొత్తంలో హింసే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఆ మూడు ప్రాంతాలకు ఈ గ్యాంగ్ వార్ లకు సంబంధం ఏంటనేది మూవీలోనే చూడాలి. 


ఇక మూవీలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. డ్రమ్స్ శివమణి ఈ మూవీకు సంగీతం అందించారు. ఆయన్ మార్క్ మ్యూజిక్ బాగా కనబడుతోంది. విజువల్స్ కూడా బాగానే అనిపించాయి. ఇక ప్రియమణి మూవీలో మాస్ లుక్ లో కనిపిస్తోంది. ఈ సినిమా దర్శకుడు వివేక్ దర్శకుడు బాల కు శిష్యుడే. ఆయన ప్రభావం కాస్త సినిమాలో కనిపిస్తున్నట్టు ఉంది. మొత్తంగా ‘కొటేషన్ గ్యాంగ్’ ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది. మరి మూవీ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి. 


మొదట ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసి ఎడిటింగ్ చేసిన తర్వాత విజువల్స్, మేకింగ్ ఆఫ్ కంటెంట్ చూశాక ఇది థియేటర్లో విడుదల చేయాల్సిన చిత్రమని మేకర్స్ భావించారట. అందుకే ఈ మూవీను థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదట ఈ మూవీను తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారట. తర్వాత ఇతర భాషల్లోనూ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాను ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.  



Also Read: నిద్రలేని రాత్రిళ్లు గడిపా, ‘గుంటూరు కారం’ మూవీపై క్లారిటీ ఇచ్చిన తమన్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial