Tomatoes Order On Paytm: కొన్ని నెలలుగా, భారతదేశ జనాభా మొత్తానికి టమాటా ధరలు రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వాటి ధరల విని జడుసుకుంటున్నారు. నిన్న (మంగళవారం, 01 ఆగస్టు 2023) మదనపల్లె మార్కెట్‌లో నాణ్యమైన టమాటా క్రేటు రేటు రూ. 5,600 పలికింది. అంటే, కిలో ధర రూ. 224కు చేరింది. ఇది హోల్‌సేల్‌ రేటు. రిటైల్‌ మార్కెట్‌లో కిలో టమాటాను నాణ్యతను బట్టి రూ. 250 నుంచి రూ. 300 వరకు చెబుతున్నారు. ఇటీవలి వర్షాలకు తెలంగాణలో పంట పాడైపోవడంతో, అక్కడ కూడా దాదాపు ఇదే రేటు పెట్టి కొనాల్సి వస్తోంది.


టమాటా ధర భారం నుంచి కామన్‌ మ్యాన్‌కి ఊరట కల్పించడానికి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో, 'ఓపెన్ నెట్‌వర్క్ ఫర్‌ డిజిటల్ కామర్స్' (ONDC) ఆన్‌లైన్‌లో చౌకగా టమాటాలు అమ్మడం స్టార్ట్‌ చేసింది. ఈ ప్రయత్నం ఫలించింది, కేవలం ఒక వారం రోజుల్లోనే దిల్లీలో 10,000 కిలోలకు పైగా టమాటాలను డిస్కౌంట్‌ రేటుకు అమ్మింది. డిస్కౌంట్‌ అంటే పదో, పరకో తగ్గించడం కాదు. కిలో టమాటాలను కేవలం 70 రూపాయలకే సెల్‌ చేసింది. ఇవన్నీ 'హోమ్‌ డెలివెరీ' ఆర్డర్స్‌.


Paytm భాగస్వామ్యంతో భారీ విక్రయాలు
ONDC, పేటీఎం పార్ట్‌నర్‌షిప్‌తోనూ టమాటాలను అమ్ముతోంది. మొత్తం టమాటా అమ్మకాల్లో 60 శాతం Paytm ద్వారానే జరిగాయి. ఈ లెక్కన, ONDC- పేటీఎం కలిసి ఒక్క దిల్లీలోనే 6,000 కిలోల టమోటాలను సేల్‌ చేశాయి. ప్రస్తుతం దిల్లీలో టమాటా రిటైల్ ధర కిలో రూ. 150 నుంచి రూ. 180 పలుకుతోంది. దిల్లీని ఆనుకుని ఉన్న నోయిడాలో కిలో రేటు రూ. 200 నుంచి రూ. 220 వరకు ఉంది. మీరు కూడా పేటీఎం, మ్యాజిక్‌పిన్‌ (Magicpin), మై స్టోర్‌ (My Store) వాటి యాప్స్‌ ద్వారా తక్కువ రేటుకే టమాటాలు కొనొచ్చు. ఈ కింది స్టెప్స్‌ ఫాలో అయితే, ఆన్‌లైన్‌ ద్వారా టమాటాలను తక్కువ రేటుకే ఇంటికి ‍‌(హోమ్‌ డెలివెరీ) తెప్పించుకోవచ్చు.


Paytm యాప్ ద్వారా డిస్కౌంట్‌ రేటుకు టమోటాలను ఇలా ఆర్డర్ చేయండి:
1. ముందుగా మీ స్మార్ట్‌ ఫోన్‌లో లొకేషన్‌ ఆన్‌ చేయండి
2. ఇప్పుడు Paytm యాప్ ఓపెన్ చేసి అందులో ONDC Food అని సెర్చ్ చేయండి.
3. ONDC Paytm మీకు కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి.
4. ఈ పేజీలో మీకు అన్ని స్టోర్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్‌ మీ డెలివరీ లొకేషన్‌కు అనుగుణంగా మాత్రమే కనిపిస్తాయి.
5. ఆ తర్వాత, మీ లొకేషన్‌కు తగ్గట్లుగా ఒక స్టోర్‌ నుంచి టమాటాల కోసం ఆర్డర్ చేయండి.
6. చివరిగా, టమాటాలను డెలివెరీ చేయాల్సిన చిరునామా, పేమెంట్‌ ప్రాసెస్‌ పూర్తి చేయండి.


ఇంట్లోనే కూర్చుని మ్యాజిక్‌పిన్ నుంచి టొమాటోలను ఆర్డర్ చేయండి:
1. ముందుగా, మీ స్మార్ట్‌ఫోన్‌లోకి Magicpin యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోండి.
2. ఈ యాప్‌లో, NCCF నుంచి టొమాటోస్ ఆప్షన్‌ ఎంచుకోవాలి.
3. ఇక్కడ కూడా, టమాటాలను కొనుగోలు చేసేందుకు పిన్ కోడ్ వారీగా స్టోర్స్‌ కనిపిస్తాయి.
4. ఆ తర్వాత మీ డెలివరీ అడ్రెస్‌, చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయండి.


ఒకేసారి ఎన్ని టమోటాలు ఆర్డర్ చేయవచ్చు?
ONDC ద్వారా, కస్టమర్‌లు వారానికి 2 కిలోల టమోటాలను మాత్రమే ఆర్డర్ చేయగలరు. ఈ రెండు కిలోల టమాటాలు కేవలం 140 రూపాయలకే మీ ఇంటికి వస్తాయి. హోమ్ డెలివరీకి స్పెషల్‌ ఛార్జ్‌ ఏమీ లేదు, ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం ద్వారా, మార్కెట్‌ వెళ్లి పొడవైన లైన్లలో నిలబడాల్సిన పని కూడా తప్పుతుంది.


డిస్కౌంట్‌ రేటుకే టమాటా విక్రయం ప్రభావంతో  ONDCలో రష్‌ పెరిగింది. ఈ ఫ్లాట్‌ఫామ్‌ ప్రారంభించిన తర్వాత, మొత్తం ఆర్డర్లు తొలిసారిగా 11 లక్షలకు పైకి చేరాయి.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial