బన్నీకి రామ్ చరణ్, బాలయ్య అభినందనలు
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మార్మోగిపోతుంది. అందుకు కారణం బన్నీకి నేషనల్ అవార్డు రావడమే. ఆగస్టు 25న 69వ జాతీయ అవార్డ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే కదా. ఈ అవార్డ్స్ లో 'పుష్ప' సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకొని సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. 70 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటిసారిగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అల్లు అర్జున్ కి మాత్రమే దక్కడం విశేషం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరూ అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. బన్నీ నివాసానికి విచ్చేసి తమ అభినందనలు తెలియజేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
https://telugu.abplive.com/entertainment/cinema/ramcharan-and-balakrishna-responds-on-69th-national-film-awarda-2023-112403
‘పుష్ప2’ విడుదల అప్పుడేనా? బన్నీ అభిమానులకు పండగే!
ఇండియన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో 'పుష్ప- ది రూల్' ఒకటి. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. 'పుష్ప- ది రైజ్' పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో దాన్ని మించేలా 'పుష్ప- ది రూల్' ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘పుష్ప’ మూవీ సత్తా చాటింది. ఇందులో అద్భుత నటన కనబర్చిన అల్లు అర్జున్, ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు. ఏ తెలుగు హీరోకు సాధ్యం కాని ఘనతను సాధించారు. ఈ మూవీకి చక్కటి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప2’పై కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొన్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'గాండీవధారి అర్జున' రివ్యూ : వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు సినిమా ఎలా ఉందంటే?
వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన సినిమా 'గాండీవధారి అర్జున'. ఇందులో సాక్షి వైద్య కథానాయిక. వాతావరణంలో మార్పులు, మనవాళిపై ప్రభావం వంటి అంశాలను స్పృశిస్తూ యాక్షన్ నేపథ్యంలో సాగిన చిత్రమిది. ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘ఉప్పెన’ కథ వినగానే చిరంజీవి అలా అన్నారు - నేషనల్ ఫిల్మ్ అవార్డుపై దర్శకుడు బుచ్చిబాబు
69వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఏకంగా 10 అవార్డులు గెలుచుకుని దుమ్మురేపాయి. 2021 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యింది. తొలి మూవీతోనే ఏకంగా నేషనల్ అవార్డు రావడం పట్ల దర్శకుడు బుచ్చిబాబు ఆనందంలో మునిగిపోయారు. కెరీర్ లో ఫస్ట్ మూవీతోనే అద్భుత ఘనతను సాధించడంతో మిత్రులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. తొలి మూవీ ఏకంగా రూ. 100 కోట్లు వసూళు చేయడంతో పాటు ఇప్పుడు జాతీయ అవార్డుకు ఎంపిక కావడంతో, సినీ ప్రముఖులు బుచ్చిబాబును అభినందించారు. ఆయన సినీ కెరీర్ మరింత ఉన్నత స్థానాలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'బెదురులంక 2012' రివ్యూ : కార్తికేయ & టీమ్ నవ్వించారా? సందేశం ఇచ్చారా?
యువ కథానాయకుడు కార్తికేయకు 'ఆర్ఎక్స్ 100' భారీ విజయం అందించింది. అది గోదావరి నేపథ్యంలో తీసిన సినిమా. అందులో హీరో క్యారెక్టర్ పేరు శివ. కార్తికేయ నటించిన తాజా సినిమా 'బెదురులంక 2012' కూడా గోదావరి నేపథ్యంలో తీసిన సినిమా. ఇందులోనూ హీరో క్యారెక్టర్ పేరు శివ. సెంటిమెంట్ ప్రకారం అలా పెట్టలేదని, కుదిరిందని కార్తికేయ తెలిపారు. 'ఆర్ఎక్స్ 100'తో పరిచయమైన తాను మరోసారి 'బెదురులంక 2012'తో పరిచయం అవుతున్నానని చెప్పారు. మరి, ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)