ఇండియన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో 'పుష్ప- ది రూల్'  ఒకటి. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. 'పుష్ప- ది రైజ్' పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో దాన్ని మించేలా 'పుష్ప- ది రూల్' ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘పుష్ప’ మూవీ సత్తా చాటింది. ఇందులో అద్భుత నటన కనబర్చిన అల్లు అర్జున్, ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు. ఏ తెలుగు హీరోకు సాధ్యం కాని ఘనతను సాధించారు. ఈ మూవీకి చక్కటి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప2’పై కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొన్నాయి.


'పుష్ప- ది రూల్' విడుదల ఎప్పుడు?


ఇక తాజాగా 'పుష్ప- ది రూల్' సినిమా విడుదల తేదీపై మేకర్స్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది(2024) మార్చి 22న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ‘పుష్ప’ సినిమాతో పోల్చితే ‘పుష్ప2’ కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 75 శాతం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు ఇప్పటికే షూట్ చేశారట. చాలా వరకు వైజాగ్ లో ఈ సినిమాను షూట్ చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది చివర్లోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం అవుతుందట. దీంతో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  


భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'పుష్ప- ది రూల్'


మైత్రి మూవీ మేకర్స్ సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా.. అనసూయ, సునీల్ లతో పాటూ సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'పుష్ప' పార్ట్ 1 కి వరల్డ్ వైడ్ గా భారీ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ 'పుష్ప 2'ను ఇండియా వ్యాప్తంగానే కాకుండా చైనా, జపాన్, రష్యా వంటి ఇతర దేశాల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Read Also: ఉగాండానూ ఊపేస్తున్న తమన్నా సాంగ్ - ‘కావాలయ్య’ను రీక్రియేట్ చేసిన చిన్నారులు, వీడియో వైరల్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial