సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాలోని 'కావాలయ్యా'కు క్రేజ్ ఎల్లలు దాటేసింది. అనిరుద్ కంపోజ్ చేసిన మ్యూజిక్, తమన్నా డాన్స్ ఈ పాటను వేరే లెవల్‌కు తీసుకెళ్లాయి. ఈ సాంగ్లో తమన్నా తన గ్లామర్ తో పాటు డాన్స్ తో ఉర్రూతలూగించింది. తమన్నా తన మత్తెక్కించే అందాలతో కుర్రకారును పిచ్చెక్కించింది. అటు మూవీ టీమ్ కూడా ఈ పాటనే సినిమా ప్రమోషన్స్ కి ఎక్కువగా వాడుకున్నారు. అంతెందుకు ఒక విధంగా ‘జైలర్’పై భారీ హైప్ క్రియేట్ చేసిన పాట కూడా ఇదే. ఇప్పటికే కోట్లాది మంది సంగీత ప్రియులను ఆకట్టుకున్న ఈ పాట యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.


ఇదిలా ఉంటే తాజాగా ఈ పాట దేశ, విదేశాల్లో దాటేసింది. తాజాగా ఉగాండాలోని కొంతమంది చిన్నారులు 'కావాలయ్యా' పాటకు అదిరిపోయే డాన్స్ వేశారు. ఈ పాట ఆలపించిన సింగర్ శిల్పారావు ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇక ఈ వీడియోలో ఉగాండాకు చెందిన కొందరు చిన్నారులు బార్సిలోనా కి సంబంధించిన జెర్సీని వేసుకొని ఓ బిల్డింగ్ ముందు 'కావాలయ్యా' పాటలోని హుక్  స్టెప్స్ ని రీ క్రియేట్ చేశారు. ఇక వీడియో చివర్లో ఓ పిల్లవాడు డాన్స్ చేస్తూ ఫుట్బాల్ ట్రిక్స్ ని కూడా చూపించడం ఆకట్టుకుంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన సింగర్ శిల్పారావు పలు ఆసక్తికర పోస్టులు చేసింది.


"మీ డాన్స్ సూపర్ డూపర్ గా, చాలా అద్భుతంగా ఉంది. నా పాటకు డాన్స్ చేసినందుకు థాంక్స్. ఆఫ్రికాలో ఉన్నమీ అందరికీ నా ప్రేమాభిమానాలు. మీరు నా రోజుని మరింత అద్భుతంగా మార్చారు. 'కావాలయ్య' పాటపై మీరు చూపించిన ప్రేమకి నా ధన్యవాదాలు" అంటూ రాసుకొచ్చారు. ఉగాండా చిన్నారులు చేసిన ఈ డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెటిజెన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. మరోవైపు ఈ పాటతో తమన్నాకి గ్లోబల్ వైడ్ గా గుర్తింపు దక్కింది. 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మావా' సాంగ్ తో సమంతకి ఎలాంటి గుర్తింపు వచ్చిందో, ఇప్పుడు 'కావాలయ్యా' సాంగ్ తో తమన్నా ఆ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది.


ఇక 'జైలర్' విషయానికి వస్తే.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్స్ ని అందుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ల గెస్ట్ అప్పీరెన్స్ ల తో పాటు రజనీకాంత్ స్టైల్, యాక్షన్, అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, తమన్నా ‘కావాలయ్య’ సాంగ్ హైలెట్స్ గా నిలిచాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.


Also Read : 'గాండీవధారి అర్జున' రివ్యూ : వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు సినిమా ఎలా ఉందంటే?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial