'శాకుంతలం' నష్టాలు కవర్ చేస్తున్న రజనీకాంత్ 'జైలర్'
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) స్టార్‌డమ్ ఏంటనేది ఈ తరం ప్రేక్షకులు సైతం చూస్తున్నారిప్పుడు. ఆయన మేనియా, చరిష్మా థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టేలా చేస్తోంది. ఆయన కథానాయకుడిగా నటించిన 'జైలర్' అటు తమిళనాడులో మాత్రమే కాదు... తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఘన విజయం సాధించింది. రికార్డులను తిరగ రాస్తున్న ఈ సినిమాతో 'దిల్' రాజు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


2023లో అధిక లాభాలు, భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు - ఆ రెండూ 'మెగా' ఖాతాలోనే!
మెగా ఫ్యామిలీలో ఎక్కువ మంది హీరోలు ఉన్నారు కాబట్టి, సహజంగానే ఏడాదిలో వారి సినిమాలే ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. 2023లో ఇప్పటి వరకు మెగా హీరోల నుంచి నాలుగు చిత్రాలు వచ్చాయి.. మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ఏడున్నర నెలల బాక్సాఫీస్ లెక్కల ప్రకారం.. 'వాల్తేరు వీరయ్య' & 'విరూపాక్ష' మూవీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిస్తే, 'బ్రో' 'భోళా శంకర్' చిత్రాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ ఏడాది అధిక లాభాలు రాబట్టిన చిత్రం మరియు భారీ నష్టాలు మిగిల్చిన మూవీ రెండూ 'మెగాస్టార్' ఖాతాలోనే ఉన్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘భక్త కన్నప్ప’గా మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ - వామ్మో, భారీ బడ్జెట్టే!
టాలీవుడ్ రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు నటించిన సూపర్ హిట్ మూవీ ‘భక్త కన్నప్ప’. కృష్ణం రాజు కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో కృష్ణం రాజు సినీ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ మూవీ తర్వాత ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. కృష్ణం రాజు నటించిన ఈ సినిమా రీమేక్ గురించి టాలీవుడ్ లో చాలా సార్లు చర్చ జరిగింది. అయితే, మంచు ఫ్యామిలీ ఈ సినిమా రీమేక్ విషయంలో కీలక ముందడుగు వేసింది.  గతంలో  ఈ సినిమా రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించినా, ఆ తర్వాత ఎలాంటి కదలిక లేదు. రీసెంట్ గా మంచు విష్ణు ఈ సినిమా రీమేక్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


టైగర్ వేట షురూ - ఆంధ్రా రాబిన్ హుడ్‌గా మాస్ మహారాజా రవితేజ ఊచకోత
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వర రావు'. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా హిట్స్ 'కశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ 2' తర్వాత ఆయన నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. మధ్యలో రవితేజతో ధమాకా కూడా నిర్మించారు. ఈ చిత్రానికి వంశీ దర్శకుడు. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఎట్టకేలకు మహేశ్ మూవీకి డీఓపీ దొరికాడు - 'గుంటూరు కారం' టీమ్ లో చేరిన 'లియో' సినిమాటోగ్రాఫర్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'గుంటూరు కారం'. ఏ ముహార్తాన ఈ సినిమాని మొదలుపెట్టారో కానీ, మొదటి నుంచీ ఏదొక రూపంలో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. కథలో మార్పులు జరగడం, షూటింగ్ క్యాన్సిల్ అవడం, షెడ్యూల్స్ వాయిదా పడటం, హీరోయిన్లు మారడం, టెక్నీషియన్లు తప్పుకోవడం వంటివి జరుగుతూ వచ్చాయి. ఇందులో భాగంగా సినిమాటోగ్రాఫర్ ను మారుస్తున్నారనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ కొత్త డీఓపీగా మనోజ్ పరమహంస తాజాగా టీమ్ లో జాయిన్ అయ్యారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)