Konda Surekha Comments Row: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద విమర్శలు చేస్తూ, సమంత, నాగ చైతన్య, నాగార్జునపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఉండేందుకు నాగార్జున... సమంతను కేటీఆర్ (KTR)కు ఎరగావేసే ప్రయత్నం చేశాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయ విమర్శల్లోకి అక్కినేని ఫ్యామిలీని లాగడంతో ఇండస్ట్రీ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. కొండా సురేఖ వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి నాయకులపై గట్టి చర్యలు తీసుకోవాలంటూ అమల ఏకంగా కాంగ్రెస్ అధినాయకుడు రాహుల గాంధీకి ట్వీట్ చేశారు. సమంత కూడా కొండా వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు పలువురు సినీ నటులు, నటీమణులు కూడా కొండా వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. 


కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం- వెంకటేష్, అల్లు అర్జున్


నాగార్జున ఫ్యామిలీ గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను హీరోలు వెంకటేష్, అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. నిరాధార, వ్యక్తిత్వ హననానికి పాల్పడే వ్యాఖ్యలు నిజంగా అభ్యంతరకరం అన్నారు. వ్యక్తిగత జీవితాలను రాజకీయ స్వార్థంలోకి లాగడం అత్యంత దారుణం అన్నారు. వెంటనే మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.










Also Readఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?


మేం మీ స్థాయిలో మాట్లాడలేం- నటి ఖుష్బూ


మీడియా అటెన్షన్ కోసం కొంత మంది నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారని సినీ నటి కుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “కాసేపు మీడియాలో ఫేమ్ అయ్యేందుకు కొంత మంది చేసే చీప్ ట్రిక్స్ ఇలాగే ఉంటాయి. కానీ, ఓ మహిళ మరో మహిళ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. కొండా సురేఖ గారు.. మీలో కొన్ని విలువలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. బాధ్యతాయుత పదవిలో ఉన్న మీరు, ఇండస్ట్రీలోని వారి గురించి ఇలా నిరాధారమైన, దారుణమైన కామెంట్స్ చేయకూడదు. వెంటనే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాలి. భారత్ లో డెమోక్రసీ అనేది వన్ వే ట్రాఫిక్ కాదు. మేం మీ స్థాయిలో దిగజారి మాట్లాడలేం” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.






రాజకీయ వినోదం కోసం ఇతరుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకండి- మంచు లక్ష్మి


రాజకీయ విమర్శల కోసం ఇతరుల వ్యక్తిగత జీవితాలను బజారులోకి లాగకూడదని నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. “మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. రాష్ట్రంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగినప్పుడు దాని నుంచి తప్పించుకునేందుకు, దృష్టిని మళ్లించేందుకు సినీ పరిశ్రమ మీద లేని అభాండాలు వేస్తారు. మనం మౌనంగా ఉండకూడదు. దారుణ కామెంట్స్ చేసిన వారికి తగిన బుద్ది చెప్పాలి. సినీ పరిశ్రమ కోసం పని చేసే వారికి రెస్పెక్ట్ ఇవ్వండం నేర్చుకోండి” అంటూ మంచు లక్ష్మి రిక్వెస్ట్ చేసింది.  






Also Readఅటెన్షన్ కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సిగ్గుచేటు - కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరంజీవి ట్వీట్!


అటు “సినిమా రంగంలో ఉన్న ఆడవారికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. మిగతా రంగాల్లో పని చేసే ఆడవారికి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారో అలాగే సినిమా పరిశ్రమలో ఉన్న ఆడవాళ్లకు కూడా ఇవ్వాలి” అని నటి హేమ సోషల్ మీడియా వేదికగా కోరారు.






Read Also: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని ఖండించిన నాగార్జున, అసలేం జరిగిందంటే!