బిగ్ బాస్ 40 వ రోజు...'నాయిరే నాయిరే' సాంగ్ తో రోజు మొదలైంది. ఈ వారం బెస్ట్, వరస్ట్ పెరఫామెన్స్ పై ప్రియ, రవి, శ్రీరామ్ ఓ వైపు... సన్నీ, మానస్, కాజల్ మరోవైపు డిస్కస్ చేసుకున్నారు. కిచెన్లో రైస్ ఉడుకుతుండగా శ్వేత హాట్ వాటర్ పెట్టుకుని తిరిగి రైస్ పెట్టడం మరిచిపోయింది. ఇదే విషయం ప్రియ చెప్పడంతో ఇద్దరి మధ్యా కాసేపు వాదన జరిగింది. ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్:1.స్కేల్ కార్నర్ లో గోళీని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగేసరికి ఎవరు ఎక్కువ గోళీలు బ్యాలెన్స్ చేస్తే వాళ్లే విజేతలు. ప్రియ-కాజల్ పోటీ పడిన ఈ టాస్క్ లో కాజల్ విజేతగా నిలిచింది. లగ్జరీ ఐటెమ్స్ పేపర్స్ పెట్టిన కుండల్లో ఒకటి ఎంపిక చేసుకుని పగులగొట్టగా రవ్వ వచ్చింది. 2.ప్రియాంక సింగ్, శ్వేత ఇద్దరిలో ఎవరు ఎక్కువ యాపిల్స్ తో టవర్ పెడతారో వాళ్లే విజేతలు. ఈ టాస్క్ లో శ్వేత విజేతగా నిలిచి బటర్ తీసుకొచ్చింది. 3.బాల్స్-చాక్ స్టిక్స్: ఈ టాస్క్ లో లోబో, యానీ పార్టిసిపేట్ చేశారు. స్టిక్స్ తో బాల్ పట్టుకుని మరో కార్నర్లో ఉన్న బాక్స్ లో పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో లోబో విజేతగా నిలిచాడు. పన్నీర్ వచ్చింది.4.స్ట్రా సహాయంతో గాలి పీలుస్తూ బాల్స్ ని పట్టుకుని మరో కార్నర్లో ఉన్న ప్లేట్లో వేయాల్సి ఉంటుంది. శ్రీరామ్, రవి పార్టిసిపేట్ చేసిన ఈ టాస్క్ లో రవి విజేతగా నిలవగా ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చింది.5. ముక్కుకి జెల్ రాసుకుని కాటన్ అతికించుకుని మరో కార్నర్లో ఉన్న ప్లేట్లో వేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో విశ్వ, షణ్ముక్ పోటీపడగా షణ్ముక్ విజేతగా నిలిచాడు. ఈ సారి కాఫీ వచ్చింది.
Also Read: పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన బాహుబలి విలన్Also Read: 'స్వామిరారా' టీమ్ మూడోసారి…Also Read: వరుడు కావలెను' సినిమా విడుదల ఎప్పుడంటే...Also Read: క్రేజీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ తర్వాతి సినిమా.. పండగ రోజు రెండు కొత్త సినిమాలతో చెర్రీ రచ్చ!Also Read: జైలు నుంచి వీడియో కాల్.. ఆర్యన్‌కు రూ.4,500 మనీ ఆర్డర్ పంపిన షారుక్!Also Read: సమంత బైలింగ్యువల్ సినిమా.. 'జై భీమ్' టీజర్ తో అదరగొట్టిన సూర్య.. Also Read : ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి