గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ను సంగీత దర్శకుడు తమన్ (Thaman Viral Comments) మరోసారి ఆకాశానికి ఎత్తేశారు. 'వీర సింహా రెడ్డి' సినిమా విడుదలైన తర్వాత ఓ ఇంటర్వ్యూలో తెలుగు రాష్ట్రాల్లో 'గోవిందా గోవిందా...' జపం తర్వాత మనం ఎక్కువ వినేది 'జై బాలయ్య...' అనడంతో కొందరు విమర్శలు చేశారు.


'జై బాలయ్య...'ను గతంలో 'గోవిందా గోవిందా...'తో పోల్చిన తమన్... ఇప్పుడు నట సింహం బాలకృష్ణను శివుడిగా పేర్కొన్నారు. 'వీర సింహా రెడ్డి' విజయోత్సవ వేడుకలో ఆయన స్పీచ్ ఒక్కసారి చూస్తే...
 
బాలకృష్ణను శివుడిలా చూస్తున్నాను
''నేను 'అఖండ' సినిమా నుంచి ఆయన (బాలకృష్ణ) ను శివుడిలా చూస్తున్నాను. నా జీవితానికి ఆయనే శివుడు. అంతే! నేను 'అఖండ' ఆర్ఆర్ (నేపథ్య సంగీతం) చేస్తున్న సమయంలో స్క్రీన్ మీద నిజంగా శివుడిని చూస్తున్నాను. శివుడికి ఎలా చేస్తామో... అలా చేశాను. నేను నాన్ వెజ్ తినను. ఆమ్లెట్ మాత్రం తింటాను. అయితే, 'అఖండ'కు ఆర్ఆర్ చేసేటప్పుడు ఆమ్లెట్ కూడా తినకుండా వర్క్ చేశా. రోజూ లింగ పూజ చేస్తూ చాలా కష్టపడ్డాను'' అని తమన్ చెప్పారు. 


కత్తులతో ఆర్ఆర్ కొట్టాను
'క్రాక్' సినిమా నుంచి గోపీచంద్ మలినేని 2.ఓ వెర్షన్ చూస్తున్నాని తమన్ అన్నారు. ఫైట్స్ చాలా బాగా డిజైన్ చేశాడని చెప్పుకొచ్చారు. తనకు 'వీర సింహా రెడ్డి' చిత్ర కథను గోపీచంద్ మలినేని చాలా తక్కువ సమయంలో చెప్పాడని, సినిమాలో ఎనిమిది ఫైట్స్ ఉండటంతో నేరేషన్ వెంటనే పూర్తయిందని అన్నారు. యాక్షన్ సీక్వెన్సులకు ఆర్ఆర్ చేసేటప్పుడు స్టిక్కులతో కాదని, చేతుల్లో రెండు కత్తులు పెట్టుకుని వాయించానని తమన్ చెప్పడం గమనార్హం. బాలకృష్ణ తమ గుండెల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు నిజాయతీగా పని చేస్తామని అన్నారు.


సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలకు పని చేయడం పెద్ద గిఫ్ట్ అని తమన్ అన్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి సినిమాలు చేస్తున్న చిరంజీవి, బాలకృష్ణ... 2022లో కూడా పోటీ పడుతున్నారని, వాళ్ళ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు.
  
ఇంకు తీసేసి బ్లడ్ పోసి రాశాడు
కమర్షియల్ పాటలు రాయడం చాలా కష్టమని తమన్ అన్నారు. 'వీర సింహా రెడ్డి' చిత్రానికి రామ జోగయ్య శాస్త్రి పెన్నులో ఇంకు తీసేసి బ్లడ్ పోసి రాశారని చెప్పారు. లవ్ సినిమా అంటే ప్రేమ, దోమ అని ఏదేదో చెప్పేయవచ్చని, కానీ మాస్ పాటలు 'సుగుణ సుందరి...', 'మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి...', 'జై బాలయ్య...', 'మాస్ మొగుడు వచ్చాడు...' వంటివి రాయడం కష్టమని వివరించారు. 'వీర సింహా రెడ్డి'కి రామ జోగయ్య శాస్త్రి సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్ అని యాంకర్ చెప్పారు గానీ, ఆయన స్పైనల్ కార్డ్ (వెన్నుముక) అని తమన్ కాంప్లిమెంట్ ఇచ్చారు. 


Also Read : ఇప్పుడు కేసులు పెట్టడం... మళ్ళీ ఏపీ ప్రభుత్వానికి చురకలు వేసిన బాలకృష్ణ?


సాయి మాధవ్ బుర్రా సంభాషణల గురించి కూడా తమన్ మాట్లాడారు. ఎడమ చేతిలో కత్తి పెట్టుకుని కుడి చేత్తో మాటలు రాశారన్నారు. 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సంక్రాంతికి రెండు విజయాలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.


Also Read : రాజమౌళిని పొగిడితే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకోవడం ఏంట్రా బాబు?