Rohit Sharma Record: భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వేగవంతమైన బ్యాటింగ్ కారణంగా అతన్ని 'హిట్‌మ్యాన్' అని పిలుస్తారు. అద్భుతమైన సిక్సర్లు కొట్టే ఆటగాడిగా రోహిత్ శర్మకు మంచి పేరుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ అర్థ సెంచరీ సాధించాడు. 50 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో రోహిత్ శర్మ 51 పరుగులు చేశాడు. భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు మొత్తం 132 సిక్సర్లు బాదాడు.


మూడో స్థానానికి చేరుకున్న రోహిత్ శర్మ
భారత కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో రోహిత్ శర్మ మూడో స్థానానికి చేరుకున్నాడు. అయితే అతను ప్రస్తుతానికి సౌరవ్ గంగూలీని సమం చేశాడు. వీరు ఇద్దరూ చెరో 132 సిక్సర్లు కొట్టారు. అదే సమయంలో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 61 సిక్సర్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.


తదుపరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ అవుతుందా?
భారత కెప్టెన్‌గా, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన విరాట్ కోహ్లీ 138 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టగలడు. అయితే ఈ రికార్డును బద్దలు కొట్టాలంటే రోహిత్ శర్మ తదుపరి మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు కొట్టాలి.


భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ను జనవరి 24వ తేదీన మంగళవారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఇది ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ కావడంతో పాటు భారత్ వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకుకు చేరనుంది. ఈ లిస్ట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ 211 సిక్సర్లతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.


భారత కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు
మహేంద్ర సింగ్ ధోని - 211 సిక్సర్లు
విరాట్ కోహ్లీ - 138 సిక్సర్లు
రోహిత్ శర్మ - 132 సిక్సర్లు
సౌరవ్ గంగూలీ - 132 సిక్సర్లు
మహ్మద్ అజారుద్దీన్ - 61 సిక్సర్లు


న్యూజిలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ త్వరలో భారీ స్కోరు చేయబోతున్నానని చెప్పడం విశేషం. దీన్ని బట్టి చూస్తే తర్వాతి మ్యాచ్‌లో రోహిత్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించవచ్చు. రెండో వన్డేలో భారత్ విజయం సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ చివరి మ్యాచ్‌లో కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చాడు.


ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు నాలుగు మ్యాచ్‌ల టెస్టులు ఆడనున్నాయి. దీంతో జట్టులో ఉన్న చాలా మంది సీనియర్ ఆటగాళ్లుకుమూడో వన్డేలో విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉంది.


మూడో వన్డేలో టీమ్ ఇండియా తుది జట్టు (అంచనా)
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, రజత్ పటీదార్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్