Nara Lokesh Padayatra: గతంలో జగన్ పాదయాత్ర చేశారు, మరి లోకేష్‌ విషయంలో ఎందుకిలా? మాజీ మంత్రి అమర్నాథరెడ్డి

కుప్పంలో లోకేష్ పాదయాత్ర యువగళానికి సంబంధించిన బహిరంగ సభ ఏర్పాట్లను టిడిపి మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, టిడిపి‌ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిలు స్దానిక టిడిపి‌ నేతలతో కలిసి పరిశీలించారు.

Continues below advertisement

YSRCP government is trying to create hurdles for Nara Lokesh Yuva Galam: చిత్తూరు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చట్టానికి లోబడే నిర్వహిస్తామని, యువనేత పాదయాత్రను వైసీపి అడ్డుకోలేదని టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం కుప్పంలో లోకేష్ పాదయాత్ర యువగళానికి సంబంధించిన బహిరంగ సభ ఏర్పాట్లను టిడిపి మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, టిడిపి‌ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిలు స్దానిక టిడిపి‌ నేతలతో కలిసి పరిశీలించారు.

Continues below advertisement

వైసీపి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు

అనంతరం టిడిపి మాజీ మంత్రి అమర్నాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు ప్రజలు తెలియజేసేందుకు ఈనెల 27వ తేదీన నారా లోకేష్ యువగళం పేరుతో కుప్పం నుండి ఇచ్చాపురం వరకూ చేపడుతున్న పాదయాత్రను ఎలాగైనా అడ్డుకునేందుకు వైసీపి కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. అయితే ఈ యువగళం పేరులో నారా లోకేష్ చేపడుతున్న పాదయాత్రకు ఇప్పటి వరకూ అనుమతులు ఇవ్వలేదన్నారు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో సీఏం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపిలో పాదయాత్ర చేసినప్పుడు ఎవరూ అడ్డుకోలేదని, లోకేష్ పాదయాత్రకు అనుమతులు ఇస్తారో లేదో అనేది‌ మాత్రం ఇంకా తెలీయలేదన్నారు. 

ప్రస్తుత్తం సోషల్ మీడియాలో లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని వైసీపి నాయకులు కుట్ర పూరితమైన మేసేజులు పెడుతున్నారని ఆరోపించారు. అసలు అధికార పార్టీ వైసీపీ జీవో నెంబర్-1 ను ఎందుకు తెరపైకి తీసుకువచ్చారనే విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో పోలీసులు టిడిపి నాయకులు, కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన ఘటనా కూడా జరిగిందన్నారు. అసలు పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేందుకు సీఎం సమాధానం చెప్పాలని కోరారు. లోకేష్ పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నామని, కుప్పం నుంచి ప్రారంభం అయ్యే ఈ పాదయాత్రకు రూట్ మ్యాప్ కూడా సిద్దం అయ్యిందన్నారు. 
చట్టానికి లోబడే లోకేష్ పాదయాత్ర..
లోకేష్ పాదయాత్రను చట్టానికి లోబడే నిర్వహిస్తాంమని, అయితే ప్రైవేటు స్థలంలోనే లోకేష్ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి తెలియజేశారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని వైసీపి ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. జీవో నెంబర్-1 తర్వాత వైసీపీ నేతలు ఎక్కడపడితే సమావేశాలు పెడుతున్నారని, అది మాత్రం అది‌ సీఎంకు కనిపించలేదా అని, వైసీపీకి ఒక చట్టం, ప్రతిపక్షాలకు మరో చట్టామా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎవరు భయపెట్టినా లోకేష్ పాదయాత్ర విజయవంతం చేస్తామని, లోకేష్ పాదయాత్ర చేపడుతుంటే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. అనుమతులు వచ్చినా, రాకపోయినా సమావేశాలు కొనసాగిస్తామని, లోకేష్ పాదయాత్రకు అనుమతులు అవసరమా అని, జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు అనుమతులు తీసుకున్నారా అని అడిగారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఇంటికి పోతుందని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని, చట్టాన్ని గౌరవించి లోకేష్ పాదయాత్ర చేపడతామని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి అన్నారు.

Continues below advertisement