కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 2021 సంక్రాంతి కానుకగా.. 'మాస్టర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ హీరో 'బీస్ట్' సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు హీరో విజయ్. ఈ సినిమా 2022 ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. సమ్మర్ లో పవర్ ప్యాక్డ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా నుండి విడుదలైన కొన్ని పోస్టర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ మరింత మాసివ్ గా ఉండడంతో ఫ్యాన్స్ తెగ షేర్స్ చేస్తున్నారు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడైపోయాయని సమాచారం. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ ప్రసార హక్కులను దక్కించుకుందని తెలుస్తోంది. దీనికోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read:'ఆచార్య' హైవోల్టేజ్ పార్టీ సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read:అజిత్ అలా చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.. రాజమౌళి వ్యాఖ్యలు..