తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్ హీరోలలో దళపతి విజయ్ (Thalapathy Vijay) ఒకరు. ప్రజెంట్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న 'G.O.A.T' (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమాకు గాను ఆయన 200 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని కోలీవుడ్ ఖబర్. ఒక్కో సినిమాకు అన్ని కోట్లు తీసుకుంటున్న హీరో అందులో రెండు మూడు శాతం పెట్టి కొత్త కారు కొనడం పెద్ద విశేషం ఏమీ కాదు. కానీ, అది రెండు కోట్ల రూపాయల కారు అంటే సామాన్యులకు కాస్త షాకింగ్ కదా! లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... విజయ్ కొత్త కారు కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే... 


బీఎండబ్ల్యూ ఐ 7 ఎక్స్ 60 కొన్న విజయ్
చెన్నై సినిమా & మీడియా వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం... ఇటీవల విజయ్ కొత్త కారు కొన్నారు. బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ 7 ఎక్స్ డ్రైవ్ 60ని ఆయన కొనుగోలు చేశారు. అది ఎలక్ట్రిక్ కార్. దాని రేటు రూ. 2.13 కోట్లు నుంచి రూ. 2.50 కోట్ల మధ్యలో ఉంటుంది. 


ప్రస్తుతానికి బీఎండబ్ల్యూ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను రెండు లాంచ్ చేసింది. విజయ్ కొన్న కారు... ప్రస్తుతానికి దేశంలో అతి కొద్ది మంది ప్రముఖుల దగ్గర మాత్రమే ఉంది. అయితే... విజయ్ ఎలక్ట్రిక్ కారు కొనడం విశేషమే కదా! ఆ కారు రేటుతో లో బడ్జెట్ సినిమా తీయవచ్చు కదూ!


Also Read: నిర్మాత ఎస్కేఎన్ ఇంటికి అల్లు అర్జున్... తండ్రి మరణించిన బాధలో ఉన్న ఆత్మీయుడికి ధైర్యం చెప్పిన బన్నీ


Cars owned by Thalapathy Vijay: దళపతి విజయ్ దగ్గర బీఎండబ్ల్యూ ఐ 7 ఎక్స్ డ్రైవ్ 60 కంటే ఖరీదైన కార్లు చాలా ఉన్నాయి. వాటిలో రోల్స్ రాయిస్ కారు ఒకటి. దాని రేటు సుమారు రూ. 8 కోట్లు. ఇంకా ఆడి ఎ8, బీఎండబ్ల్యూ 5 సిరీస్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ ఎక్స్ 6, మెర్సిడెజ్ బెంజ్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, ఫోర్డ్ ముస్టాంగ్, బెంజ్ ఈ350డి, బీఎండబ్ల్యూ 3 సిరీస్, మినీ కూపర్ ఎస్, టయోటా ఇన్నోవా, వోల్వో కార్లు ఉన్నాయి.


Also Readఆ రోజు థియేటర్లలో 'ఎమర్జెన్సీ' - ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ చూశారా?



దళపతి విజయ్‌ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులు. కొన్నేళ్లుగా తెలుగు మార్కెట్ మీద ఆయన స్పెషల్ ఫోకస్ చేశారు. తెలుగు దర్శక నిర్మాతలు వంశీ పైడిపల్లి, దిల్ రాజుతో గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన 'వారసుడు' సినిమా చేశారు. అది కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'లియో' చేశారు. విమర్శలు పక్కన పెడితే... ఆ సినిమా కూడా బాక్సాఫీస్ బరిలో వందల కోట్లు వసూలు చేసింది. 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమాను కూడా తమిళం, తెలుగుతో పాటు హిందీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Also Read లావణ్య ‘మిస్ పర్ఫెక్ట్’ ట్రైలర్ రిలీజ్ - క్లీనింగ్ వ్యసనంగా మారితే ఇలాగే ఉంటుందేమో!