బిగ్ బాస్5 సీజన్... ముందు నాలుగు సీజన్లతో పోలిస్తే కాస్త చప్పగానే సాగుతోంది. అవే ఆటలు, అవే టాస్క్ లు తప్ప కొత్తవి కనిపించడం లేదు. దీంతో బిగ్ బాస్ పై ప్రేక్షకులకు ఆసక్తి కూడా తగ్గిపోతోంది. మూడు రోజుల నుంచి మరీ ఘోరం. సిరి అలక, షన్ను సారీ అంటూ వెంటపడడం తప్ప షోలో ఇంకేం లేదు. ఈ వారం విశ్వ బయటికి వెళ్లిపోతాడని ఆల్రెడీ లీక్ వచ్చేసింది. అయితే ఇప్పుడంతా ఒకటే టాక్ నడుస్తోంది.... వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడు? అని. ముందు సీజన్లలో ఈపాటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం 70 శాతం ఆట పూర్తయిపోయినా కూడా ఇప్పటివరకు ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరగలేదు. అసలు ఎంట్రీ ఉంటుందా ఉండదా?  అని ఒకవైపు చర్చలు జరుగుతుంటే మరో వైపు మాత్రం ఓ అమ్మాయిని పంపే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. 


క్వారంటైన్లో ఓ అమ్మాయి?
వచ్చేవారం కచ్చితంగా ఓ వైల్డ్ కార్డు ఎంట్రీ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఓ అమ్మాయిని ఇప్పటికే క్వారంటైన్లో ఉంచారని కూడా అంటున్నారు. ఆ అమ్మాయిని ఈ వారంలో ఎప్పుడోసారి హౌస్ లోకి పంపొచ్చని కూడా టాక్. ఈ వారం పంపిస్తే ఆ కంటెస్టెంట్ కనీసం మూడు నాలుగు వారాలు హౌస్ లో ఉన్నా చాలు. అందుకే ఓ యంగ్, అందమైన అమ్మాయిని ఎంపిక చేసి క్వారంటైన్ లో ఉంచారని చెప్పకుంటున్నారు. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లినవారికి టైటిల్ గెలిచే అవకాశాలు మాత్రం సున్నా. ఆ విషయం అందరికీ తెలిసిందే. వారు కేవలం ఆటను రసవత్తరంగా మార్చేందుకు మాత్రమే వెళ్తారు. 


ఆ తరువాత యానీ లేదా జశ్వంత్?
ఈ వారం విశ్వ బయటికి రాబోతున్నాడని బిగబాస్ లీకు వీరులు చెబుతున్నారు. ఆ తరువాత వరుసలో జశ్వంత్, యానీ మాస్టర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు ప్రేక్షకులు. ఇక టాప్ 5లో ఉండేవాళ్లుగా సిరి, షణ్ముక్, సన్నీ, శ్రీరామచంద్ర, మానస్ లుగా ఊహించుకుంటున్నారు. టైటిల్ విన్నర్ ఎవరో మాత్రం ఈసారి అంచనా వేయడం కష్టంగానే ఉంది.  


Also read: ‘సూర్యవంశీ’ స్క్రీనింగ్ ను అడ్డుకున్న రైతులు... కేంద్రం మీద ఉన్న కోపం అక్షయ్‌పై చూపించారుగా


Also read: డెంగ్యూకే కాదు, గుండె జబ్బులకు కూడా చెక్ పెట్టే పండు... కివీ


Also read: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?
Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి


Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి