తమిళ హీరో శింబుకు చాలా కాలం తరువాత పెద్ద హిట్ దక్కింది ‘మానాడు’ సినిమాతో. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కాలంతో ముడిపడిన క్రైమ్ థ్రిల్లర్. క్రైమ్ సినిమాలకు, థ్రిల్లర్ మూవీలకు కథ బలంగా ఉంటే చాలు చిన్న హీరోలైనా మంచి పేరు వచ్చేస్తుంది. ఇలాంటి అలాంటి కథల్లో పేరున్న హీరోలు ఉంటే వసూళ్లు కూడా బాగానే ఉంటాయి. అందుకే తమిళంలో విజయవంతమైన ‘మానాడు’ సినిమాపై తెలుగు నిర్మాతల కన్నుపడింది. మొదట్లో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తారని టాక్ వచ్చింది. ఆ సినిమాను ‘ది లూప్’ పేరుతో డబ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. కానీ ఏమైందో ఏమో చివరికి అన్ని భాషల్లో రీమేక్ చేసే హక్కును సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలియచేసింది ఆ సంస్థ. రానా హీరోగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తోందట సురేష్ ప్రొడక్షన్స్. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎవరు హీరోనో కచ్చితంగా చెప్పలేం. 


తమిళంలో శింబుతో పాటూ కీలకపాత్రల్లో కళ్యాణి ప్రియదర్శన్, ఎస్ జే సూర్య నటించారు. ఈ సినిమా తమిళనాడులో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. రజనికాంత్ ఆ టీమ్ ను ఇంటికి పిలిపించుకుని ప్రత్యేకంగా అభినందించారు. నిజానికి ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ రీమేక్ హక్కులను అమ్మేశారు. రూ.125 భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించినట్టు సమాచారం. 






Also Read: మళ్లీ రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్, మెచ్చుకోకుండా ఉండలేం


Also Read: అఖండ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే... ఇక బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే


Also Read: సిరికి బ్రేకప్ చెప్పనున్న శ్రీహాన్? ఇన్స్‌స్టా నుంచి సిరి ఫోటోలను తొలగించిన ప్రియుడు


Also Read: దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?












ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.