సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి అందరూ సెలబ్రెటీలే. మహేశ్, నమ్రత సంగతి పక్కనపెడితే పిల్లలు గౌతమ్, సితార సందడి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఉంటుంది. చిన్నప్పటి నుంచి వారి ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గర చేసిన మహేశ్ తాను నటించన 'నేనొక్కడినే' సినిమాతో గౌతమ్ ని వెండితెరపైకి తీసుకొచ్చాడు. మొదటి సినిమా అయినప్పటికీ గౌతమ్  ఎలాంటి బెరుకూ లేకుండా  చక్కని నటన కనబర్చాడని ప్రశంసించారంతా. ఇప్పుడు సితార వంతు వచ్చింది.  ప్రస్తుతం మహేశ్ బాబు సెట్స్ మీదున్న' సర్కారువారి పాట'లో సితారని తీసుకొస్తారా ఏంటి అంటారేమో అదేం కాదు. సితార తమిళ హీరో విజయ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుందని టాక్. 


సెప్టెంబర్ 26న విజయ్ 66 వ సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ ప్రాజెక్టుకు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘బీస్ట్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్ అది పూర్తైన వెంటనే తన 66వ సినిమాను ప్రారంభించనున్నాడు.  ఈ సినిమాలో తండ్రి-కూతురు మధ్య బలమైన బంధాన్ని చూపించనున్నారని అందుకే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సితారను సంప్రదించారని తెలుస్తోంది. విజయ్, వంశీ, దిల్ రాజుకు మహేష్ బాబు సన్నిహితుడు కావడంతో  తన కుమార్తె సితార ఈ సినిమా చేయడానికి ప్రిన్స్ అంగీకరించాడని అంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదుకానీ వచ్చే దీపావళికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. మరోవైపు ఇప్పటికే 'శాకుంతలం' సినిమాతో అల్లు అర్జున్ కుమార్తె అర్హ వెండితెరపై ఎంట్రీ ఇస్తుండడంతో మహేశ్ అభిమానులు కూడా సితార ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ టైమ్ లో ఈ వార్త విని ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఏముందంటున్నారు. ఇప్పటికే సితార సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. 


ఇక విజయ్ విషయానికొస్తే తుపాకీ సినిమా తెలుగులో మంచి టాక్ సంపాదించుకున్నప్పటి నుంచీ టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. మెర్సల్, విజిల్ , సర్కార్, మాస్టర్ సినిమాలతో  తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ ద్విభాషా చిత్రాలు చేయాలని ఫిక్సయ్యాడు. ఇందులో భాగంగా  'మహర్షి' తో హిట్టందుకున్న వంశీపైడిపల్లితో కమిటయ్యాడు. మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో 


Also Read: మహేష్, నమ్రతలపై సితార క్యూట్ కామెంట్..
Also Read: రెహమాన్ 'బతుకమ్మ' సాంగ్.. లాంచ్ చేసిన కల్వకుంట్ల కవిత
Also Read: ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. నా కుటుంబ సభ్యులను లాగితే మర్యాదగా ఉండదు: విష్ణు వార్నింగ్
Also Read:'దమ్ముంటే ముంగటకి వచ్చి ఆడుకోవాలే..' ఓ రేంజ్ లో ఫైర్ అయిన విశ్వ..