సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఈ కపుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పోటీ పడి మరి షేర్ చేశారు. ఈ ఫొటోల్లో మహేష్, నమ్రత చాలా స్టైలిష్ గా అందంగా కనిపించారు. తాజాగా ఇదే ఫొటోను వారి కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 'మై అమ్మ అండ్ నాన్న ఆర్ ది కూలెస్ట్' అంటూ క్యూట్ క్యాప్షన్ ఇచ్చింది. 



ఈ పోస్ట్ చూసిన నమ్రత లవ్ సింబల్స్ ను కామెంట్ గా పెట్టింది. మహేష్ ఫ్యాన్స్ 'క్యూట్ కపుల్' అంటూ రిప్లై చేస్తున్నారు. మహేష్ బాబు గారాల పట్టిగా సితారకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. చిన్నవయసులోనే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి వీడియోలు చేస్తుంది. వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి సితార చేసే వీడియో బాగా వైరల్ అవుతుంటాయి. 


రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో మహేష్ తన కూతురు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కూతురితో పనిచేయాలంటే నెర్వస్ గా ఫీలవుతానని.. ఆమె ఇంగ్లీష్ సినిమాలు చేస్తానని అంటుందని.. ఈ విషయాన్ని ఆమె జోక్‌గా చెప్పిందని అన్నారు. సితార ఇంకా చిన్నపిల్ల అని.. ఆ ఏజ్‌లో ఆలోచనలు అలాగే ఉంటాయని అన్నారు. 'ఫ్రోజెన్' సినిమాకు డబ్బింగ్ చెప్పడం వల్ల ఆమెకు ఆ ఆసక్తి పెరిగిందని.. ఆ ప్రభావం వల్ల ఆమెకు ఇంగ్లీష్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుందని అన్నారు. మన పిల్లల మీద ఏదీ ఫోర్స్ చేయకూడదని.. నిర్ణయం వారికే వదిలేయాలని మహేష్ బాబు తెలిపారు.