Bheemla Nayak: దసరాకు పవన్ సర్ ప్రైజ్.. ఫ్యాన్స్ రెడీనా మరి.. 

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసే న్యూస్ ఒకటి వచ్చేసింది. అదేంటంటే..

Continues below advertisement

వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ప్రకటిస్తూ ఫ్యాన్స్ ను బాగా ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే 'భీమ్లానాయక్' ఫస్ట్ గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఇక పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి టైటిల్‌ సాంగ్‌ ను విడుదల చేశారు. 'సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు' అంటూ సాగే ఈ జానపద గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

Continues below advertisement

Also Read: సమంత సీక్రెట్ టాటూ.. ఇప్పటికీ ఉందా..?

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా రెండో పాటను విడుదల చేయబోతున్నారు. 'అంత ఇష్టం' అంటూ సాగే ఈ పాటను అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నారు. దసరా కానుకగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ అప్డేట్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్, నిత్యామీనన్ సింపుల్ లుక్ తో కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో ఒక ఇల్లు, ఉయ్యాల్లో బిడ్డ కనిపిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ లో అయితే రిలీజ్ డేట్ జనవరి 12 అనే ఉంది. అంటే ఇప్పటికైతే 'భీమ్లా నాయక్' చెప్పిన టైమ్ కి వస్తుందనే అనుకోవాలి. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే.

మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన 'అయ్యప్పనుమ్‌ కోషియమ్‌'కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మాతృకలో బిజూమీనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమార్‌ పాత్రను రానా పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Continues below advertisement