దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 18,346 కేసులు నమోదుకాగా 263 మంది మృతి చెందారు. 29,639 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 209 రోజులుగా నమోదైన రోజువారి కేసుల్లో ఇవే అత్యల్పం.






    • యాక్టివ్ కేసులు: 2,52,902

    • మొత్తం రికవరీలు: 3,31,50,886

    • మొత్తం మరణాలు: 4,49,260

    • మొత్తం వ్యాక్సినేషన్: 91,54,65,826 (గత 24 గంటల్లో 72,51,419)







మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 1 కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 0.75%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 97.93%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధిక రికవరీ రేటు.


గత 24 గంటల్లో 29,639 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


కేరళలో..


ఓనం పండుగ సమయంలో కేరళలో రోజుకు 30 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవల కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్తగా 8,850 కరోనా కేసులు నమోదుకాగా 149 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 47,29,083కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 25,526కి చేరింది. 


మొత్తం 14 జిల్లాల్లో అత్యధికంగా తిరువనంతపురంలో 1,134 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత త్రిస్సూర్ (1,077), ఎర్నాకులం (920)లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.  


మహారాష్ట్ర..


మహారాష్ట్రలో కొత్తగా 2,026 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి రోజువారి కేసుల్లో ఇదే అత్యల్పం. 26 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 65,62,514కు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,39,233కు పెరిగింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ పేర్కొంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి