బిగ్ బాస్ సీజన్ 5 ఐదో వారంలోకి ఎంటర్ అయింది. ఈ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలను విడుదల చేశారు. మొదటి ప్రోమోలో కాజల్ పై ఫైర్ అవుతూ కనిపించాడు యాంకర్ రవి. కాజల్ సరదాగా రవిని ఆట పట్టిస్తుంటే.. సీరియస్‌గా తీసుకున్న రవి అలా ఎలా అంటావంటూ ఆమెపై మండిపడ్డాడు. రెచ్చగొట్టడం నాకు కూడా వస్తుందంటూ కాజల్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు.






ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో రవి, సన్నీలు రెండు టీమ్ లుగా విడిపోయి.. రాజు గెటప్స్ లో కనిపించారు. ఆ తరువాత మానస్.. 'ఈ గట్టు నుంచి ఆ గట్టుకు రావాలంటే ఎంతిస్తారు చెప్పండి..?' అని రవిని అడిగాడు. దానికి ఆయన.. 'మీ బలాన్ని జనాలకు తెలుపుతాను.. అదిస్తాను' అని బదులిచ్చాడు. 'జరగబోయే టాస్క్ లు ఎలా ఉంటాయో రాజావారికి కూడా తెలియదు. ఎందుకంటే యుద్ధం ఏ రూపంలో వస్తుందో నాకు తెలియదు' అంటూ సన్నీ డైలాగ్ వేశాడు. 


ఆ తరువాత విశ్వ మట్టిలో మల్లయుద్ధానికి దిగాడు. ఆ సమయంలో సిరి వెళ్లి కాయిన్స్ ను దొంగిలించింది. 'దమ్ముంటే ముంగటకి వచ్చి ఆడుకోవాలే.. ఆ దొంగ బుద్ధులెందుకు' అంటూ విశ్వ హౌస్ మేట్స్ పై ఫైర్ అయ్యాడు. ఈ విషయంలో మానస్ 'పేరు తీసి మాట్లాడు.. అందరినీ ఎందుకు అంటున్నావ్' అని గొడవకు దిగాడు. దీంతో ఇద్దరూ అరుచుకుంటూ మాట్లాడారు.