Roshan Kanakala About His Parents Divorce Rumours: నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతుల కొడుకు రోషన్ కనకాల ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. తండ్రి నట వారసుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ‘బబుల్‌ గమ్‌’ సినిమాతో హీరోగా వస్తున్నాడు. రవికాంత్‌ పేరేపు తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కాబోతోంది. మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. రీసెంట్ గా ఓ ఫ్రాంక్ వీడియో చేసి, మూవీ ప్రమోషన్ కు శ్రీకారం చుట్టాడు రోషన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన సినిమాతో పాటు తల్లిదండ్రుల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.


యాడ్ తర్వాత నటన పట్ల ఇష్టం పెరిగింది- రోషన్


చిన్నప్పటి నుంచే తనకు నటన పట్ల ఆసక్తి కలిగిందని చెప్పాడు రోషన్ కనకాల. చిన్నప్పుడు అమ్మ(యాంకర్ సుమ)తో కలిసి ఓ యాడ్ లో నటించడం సంతోషం కలిగించిందన్నారు. అప్పుడే నటుడిని కావాలనే కోరిక కలిగిందని చెప్పుకొచ్చాడు. “చిన్నప్పటి నుంచి నాకు నటన పట్ల ఇష్టం ఉండేది. ఓసారి అమ్మతో కలిసి యాడ్ లో నటించాను. చాలా సంతోషం కలిగింది. అప్పుడే నటుడిగా ఎదగాలనే ఆసక్తి కలిగింది. ఆ కోరికతోనే యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశాను. ‘ఒక మనసు’ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. ‘నిర్మలా కాన్వెంట్’లోనూ ఓ పాత్ర పోషించాను. ఇప్పుడు ‘బబుల్‌ గమ్‌’ సినిమాతో హీరోగా మీ ముందుకు రాబోతున్నాను” అని చెప్పుకొచ్చాడు.


ఆ వార్తలు చూస్తూ ఎంజాయ్ చేస్తారు- రోషన్ 


పేరెంట్స్ రాజీవ్ కనకాల, సుమ విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తున్నవార్తలపైనా రోషన్ స్పందించాడు. అవన్నీ కేవలం పుకార్లుగా కొట్టి పారేశారు. “అమ్మానాన్న డివోర్స్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని చదువుతూ అమ్మానాన్న నవ్వుకునేవాళ్లు. ఓసారి తమ విడాకుల వార్తలు చూస్తూ భోజనం చేస్తున్నారు. అదే సమయంలో నేను వారిని మీరు విడాకులు తీసుకుంటున్నారా? అని అడిగాను. అలాంటిది ఏమీ లేదని చెప్పారు. ఆ తర్వాత అమ్మానాన్న విడాకుల గురించి వార్తలు వచ్చినా, అవన్నీ ఊహాగానాలే అని అర్థం అయ్యింది. పట్టించుకోవడం మానేశాను” అని వెల్లడించాడు.  


Also Read:పాపం... ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!


పేరెంట్స్ మధ్య గొడవల గురించి..


అటు తన తల్లిందండ్రుల మధ్య  గొడవలు ఉన్నాయనే వార్తలను కూడా రోషన్ ఖండించాడు. అసలు ఇలాంటి వార్తలు ఎందుకు ప్రచారం చేస్తారో అర్థం కాదన్నాడు. “మా ఇంట్లో గొడవలు ఉన్నాయో? లేదో? మాకు తెలుస్తుంది. ఎవరో బయటి వాళ్లకు ఎలా తెలుస్తుంది? ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. భార్య భర్తలు అన్నాక గొడవలు ఉంటాయి. కానీ, మా పేరెంట్స్ మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఎప్పుడైనా అమ్మ నాన్న మీద, నాన్న అమ్మ మీద కోప్పడతారు. చిన్న చిన్ని సరదా గొడవలే తప్ప, విడాకులు తీసుకునేంత గొడవలు లేవు” అని రోషన్ వెల్లడించాడు.  


Read Also: మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడ్డానికి మీరెవరు? రేణూ దేశాయ్‌ ఆగ్రహం