నిట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా రూపొందుతోన్న హాయ్ వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'హంట్' (Hunt Movie). భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ రోజు (సెప్టెంబర్ 28) ఉదయం 11.33 గంటలకు టీజర్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఏఎంబీ మాల్‌లో కార్యక్రమం నిర్వహణకు అంతా సిద్ధం అయ్యింది. చివరి నిమిషంలో ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. సుధీర్ బాబు అత్తగారు మరణించడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
Hunt Teaser Launch Cancelled : సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి (Indira Devi) ఈ రోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణ, ఇందిరా దేవి దంపతుల మూడో కుమార్తె ప్రియదర్శినిని సుధీర్ బాబు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అత్త గారు అంటే సుధీర్ బాబుకు ఎంతో గౌరవం. ఆమెను ఎంతో బాగా చూసుకుంటారు. సుధీర్ బాబు ఇంట్లో ఇందిరా దేవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించేవారు. అత్తగారి మరణంతో టీజర్ విడుదల వాయిదా వేశారు. ఏఎంబీలో ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేశారు.
త్వరలో 'హంట్' టీజర్ (Hunt Teaser) విడుదల తేదీ వెల్లడించనున్నారు. నేరుగా యూట్యూబ్‌లో విడుదల చేస్తారా? లేదంటే కార్యక్రమం నిర్వహిస్తారా? అనేది చూడాలి.
'హంట్'లో పోలీస్ అధికారిగా సుధీర్ బాబు!
'హంట్' విషయానికి వస్తే... సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. ఆయనతో పాటు శ్రీకాంత్, తమిళ హీరో భరత్ కూడా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య ఈ ముగ్గురి క్యారెక్టర్ పోస్టర్లు విడుదల చేశారు.
అర్జున్ ప్రసాద్ పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నారు. ఒక చేతిలో సిగరెట్, మరో చేతికి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్, ఒంటిపై స్టైలిష్ కోట్, అన్నిటికీ మించి కళ్లలో ఇంటెన్స్ లుక్... సుధీర్ బాబు న్యూ లుక్ బావుంది. మోహన్ భార్గవ్ పాత్రలో శ్రీకాంత్, దేవ్‌గా 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
సినిమా గురించి వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ " ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన సుధీర్ బాబు చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్... సినిమాలో ఈ ముగ్గురూ స్నేహితులుగా కనిపిస్తారు. కనిపించని శత్రువును పట్టుకోవడం కోసం ఎటువంటి వేట సాగించారన్నది చిత్రకథ. యాక్షన్ సీక్వెన్సులు నేచురాలిటీకి దగ్గరగా ఉంటాయి'' అని చెప్పారు.
Also Read : మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూత - విషాదంలో కృష్ణ ఫ్యామిలీ
సుధీర్ బాబు, శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ పోలీస్ అధికారులుగా నటిస్తున్న ఈ సినిమాలో 'మైమ్' గోపి, 'జిల్' ఫేమ్ కబీర్ దుహాన్ సింగ్, మౌనిక రెడ్డి, 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేమ్ గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, సత్య కృష్ణన్ తదితరులు ఇతర తారాగణం.
ఈ చిత్రానికి కళ : వివేక్ అన్నామలై, యాక్షన్ : రేనౌడ్ ఫవేరో (యూరప్), స్టంట్స్ : వింగ్ చున్ అంజి, కూర్పు : ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం : అరుల్ విన్సెంట్, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.
Also Read : 'నా ఫ్యామిలీను హెరాస్ చేశారు, ఆ ప్రముఖ నటుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది' మంచు విష్ణు కామెంట్స్!