సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా (SSMB 28) సెట్స్ మీదకు వెళ్లిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12న షూటింగ్ స్టార్ట్ చేశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఇప్పుడు షూటింగ్ లొకేషన్ మారింది!


అన్నపూర్ణ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి
మహేష్ - త్రివిక్రమ్ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో స్టార్ట్ (SSMB28 Aarambham) అయ్యింది. నిన్నటితో అక్కడ షూటింగ్ ముగిసింది. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్లాన్ చేశారు. అవుట్ డోర్ యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి ప్లాన్ చేశారట.


మహేష్ కొత్త లుక్...
అభిమానులకు కిక్!
మహేష్, త్రివిక్రమ్ కలయికలో ఇప్పటికి రెండు సినిమాలు వచ్చాయి. తొలిసారి వీళ్ళిద్దరూ చేసిన సినిమా 'అతడు'. ఆ తర్వాత 'ఖలేజా' చేశారు. 'అతడు' కల్ట్ క్లాసిక్ కాగా... 'ఖలేజా' మహేశ్‌కు కొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ రెండు సినిమాల్లో మహేష్ లుక్స్ అప్పటి వరకు చేసిన సినిమాలకు డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రజెంట్ సినిమాలో లుక్ కూడా డిఫరెంట్‌గా ఉంది. మహేష్ అభిమానులకు కిక్ ఇచ్చింది.


బ‌స్‌ల‌తో ఫైట్...
సూపర్ మాస్!
SSMB 28లో యాక్షన్ సీన్స్ కూడా హైలైట్ కానున్నాయని టాక్. మహేశ్ కోసం త్రివిక్రమ్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట. ఇప్పుడు ఆ ఫైట్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయనున్నారు. మహేశ్ బాబు డేర్ డెవిల్ స్టంట్స్ చేయడానికి ప్రిపేర్ అవుతోందట. అందులో చాలా బస్సులు ఉంటాయని తెలిసింది. ఘట్టమనేని ఫ్యాన్స్, ప్రేక్షకులకు సూపర్ కిక్ ఇస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఆయన మూడు ట్యూన్స్ ఫైనలైజ్ చేశారని టాక్. త్రివిక్రమ్ సినిమా అంటే తమన్ స్పెషల్ ఇంట్రెస్ట్ పెడతారు. గతంలో మహేష్ బాబుకు ఆయన మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అందువల్ల, ఈ సినిమాలో పాటలపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. 


త్రివిక్రమ్ మాస్ అంటే మామూలుగా ఉండదు!
మహేశ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన 'అతడు'లో పొలంలో తీసిన ఫైట్ మాసీగా ఉంటుంది. అలాగే, 'జల్సా'లో ముఖేష్ రుషి పొలంలో ఉత్తరాది మనిషిని బెదిరించే సీన్... 'అరవింద సమేత వీరరాఘవ'లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ కూడా చాలా మాసీగా ఉంటాయి. బావుంటాయి. అందువల్ల, మహేశ్ బాబు లేటెస్ట్ మూవీలో మాస్ ఫైట్ అనేసరికి అభిమానుల్లో అంచనాలు పెరగడం సహజం.


Also Read : నా కథలు దేశం దాటి వెళతాయనుకోలేదు - హాలీవుడ్‌లో 'ఆర్ఆర్ఆర్' సక్సెస్‌పై రాజమౌళి


పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.






Also Read : 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' రివ్యూ : కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ కుమార్తె నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?