'ఆర్ఆర్ఆర్' (RRR Movie) కేవలం భారతీయ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకున్న, అలరించిన సినిమా కాదు, ప్రపంచ ప్రేక్షకుల దృష్టి భారతీయ సినిమా మీద పడేలా చేసిన సినిమా! థియేటర్లలో సినిమా విడుదల అయినప్పుడు... భారతీయ ప్రేక్షకులు అందరూ సినిమా చూశారు. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదల అయిన తర్వాత వెస్ట్రన్ ఆడియన్స్ కూడా చేశారు. ముఖ్యంగా 'అవెంజర్స్', 'డాక్టర్ స్ట్రేంజ్', 'స్పైడ‌ర్‌మ్యాన్ వర్స్' వంటి  హాలీవుడ్ సినిమాలకు పని చేసిన రచయితలు, నిర్మాతలు, దర్శకులు సినిమాను ప్రశంసిస్తూ... ట్వీట్స్ చేశారు.


'టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌' (Toronto International Film Festival 2022)కి అతిథిగా వెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి... ఇండియన్ సినిమా గురించి, వెస్ట్రన్ ఆడియన్స్ నుంచి 'ఆర్ఆర్ఆర్'కు లభించిన విశేష ఆదరణ గురించి మాట్లాడారు.


నా కథలు దేశం దాటి వెళతాయనుకోలేదు!
'ఆర్ఆర్ఆర్'కు ముందు రాజమౌళి తీసిన సినిమా 'బాహుబలి'. అది జపాన్‌లో మంచి విజయం సాధించింది. 'ఆర్ఆర్ఆర్' గురించి చెప్పే ముందు... 'TIFF 22'లో ఆ సినిమా విజయం గురించి రాజమౌళి మాట్లాడారు. ''ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో భారతీయులు ఉన్నారు. మేం వాళ్ళ కోసం సినిమాలు తీస్తాం. మా 'బాహుబలి'కి అడ్వాంటేజ్ మైలేజ్ ఏంటంటే... జపాన్‌లో ఆదరణ లభించింది. నా కథలు తెలుగు ప్రేక్షకులు, రాష్ట్రాలు దాటి మా దేశంలోని ఇతర ప్రేక్షకుల దగ్గర వెళతాయని ఆశించాను. కానీ, మా భారతీయులను దాటి వెళతాయని అనుకోలేదు. జపాన్‌లో 'బాహుబలి'కి ఆదరణ లభించినప్పుడు... వాళ్ళ సెన్సిబిలిటీస్ మాకు దగ్గరగా ఉన్నాయని అనుకున్నాను'' అని జక్కన్న చెప్పారు. 


'ఆర్ఆర్ఆర్'... అసలు ఊహించలేదు!
'బాహుబలి'కి జపాన్‌లో ఆదరణ లభించిన తర్వాత ఏషియన్ ఆడియన్స్ నుంచి ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలనుకున్నారట రాజమౌళి. 'ఆర్ఆర్ఆర్' సినిమాకు వెస్ట్రన్ ఆడియన్స్ నుంచి అటువంటి స్పందన ఊహించలేదన్నారు. రాజమౌళి మాట్లాడుతూ ''సినిమా విడుదలైన తర్వాత ఒక్కొక్కరూ ట్వీట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రశంసించే వాళ్ళు కొంత మంది ఉన్నారని అనుకున్నా. ఆ కొందరు వందలు అయ్యారు. వందల నుంచి వేల మంది 'ఆర్ఆర్ఆర్' గురించి గొప్పగా మాట్లాడారు. వెస్ట్రన్ దర్శకులు, రచయితలు , విమర్శకులు 'ఆర్ఆర్ఆర్' గురించి చాలా గొప్పగా మాట్లాడారు. నా గురించి, నా సినిమాల గురించి నాకు తెలియదని అర్థం అయ్యింది. వెస్ట్రన్, ఇండియన్ ఆడియన్స్ సెన్సిబిలిటీస్ వేరుగా ఉంటాయని అనుకున్నాను. కానీ, సారూప్యతలు ఉన్నాయని అనిపిస్తోంది'' అని రాజమౌళి తెలిపారు. 


Also Read : 'శాకిని డాకిని' రివ్యూ : రెజీనా, నివేదా థామస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?


మహేష్ బాబుతో రాజమౌళి సినిమా
Rajamouli On His Next Movie With Mahesh Babu : 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎస్ఎస్ రాజమౌళి సినిమా ఏదీ స్టార్ట్ కాలేదు. అయితే... సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. టోరెంటోలో ఆ సినిమా గురించి కూడా ఆయన మాట్లాడారు. మహేష్ బాబుతో తాను తీయబోయే సినిమా యాక్షన్ అడ్వెంచర్ అని, మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ సినిమా చేయబోతున్నానని రాజమౌళి తెలిపారు.





Also Read : 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' రివ్యూ : కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ కుమార్తె నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?