ఈ శుక్రవారం థియేటర్స్‌లో  సందడి చేసిన సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’కి పాజిటివ్ టాక్ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు.. హీరో సుధీర్ బాబుతో కలిసి ఈ సినిమాను తన హోమ్ థియేటర్‌లో చూశాడు. ఈ విషయాన్ని సుధీర్ బాబు  ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మహేష్ సినిమా చూస్తున్నంత సేపు చాలా టెన్షన్ పడ్డానని తెలిపాడు. 



సినిమా చూసిన తర్వాత స్పందించిన మహేశ్ బాబు.. సుధీర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా అద్భుతంగా ఉందని కొనియాడాడు. సీనియర్ నటుడు నరేశ్, హీరోయిన్ ఆనంది నటన చాలా బాగుందని మహేష్ బాబు తెలిపాడు.  






పలాస తర్వాత దర్శకుడు కరుణ కుమార్ మంచి ఇంటెన్సివ్ ప్రేమకథను తెరకెక్కించారని… ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ట్వీట్ చేశాడు మహేశ్. సుధీర్ బాబు గ్రామీణ యువకుడిగా భలే ఆకట్టుకున్నాడని ట్వీట్ చేశాడు.



దేశవ్యాప్తంగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాకు చాలా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియెట్రికల్ రైట్స్  భారీ ధరకే అమ్ముడయ్యాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ శ్రీదేవి సోడా సెంటర్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఓవర్సీస్‌లోనూ ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీకి మంచి స్పందనే వచ్చిందని చిత్ర యూనిట్ చెబుతోంది. 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్ పతాకంపై కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 


ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’తో బిజీగా ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్.  ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read:అఖిల్-పూజాహెగ్డే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఖరారు


Also Read: పుష్ప రాజ్‌ని ఢీ కొట్టబోతోన్న IPS భన్వర్ సింగ్ షెకావత్.. తగ్గేదే లే అన్నట్టున్న ఫహద్ ఫస్ట్ లుక్..


Also Read: పవర్ స్టార్‌తో బుట్టబొమ్మ.. ఆ దర్శకుడితో మూడోసారి.. పూజా హెగ్డేకు గోల్డెన్ ఛాన్స్!


Also Read: గాయకుడు-నటుడు యోయో సింగ్ పై ఢిల్లీ కోర్టులో గృహహింస కేసు


Also Read: రక్తంతో తడిసిన కత్తి.. బ్లాక్ కలర్ లాంగ్ కోట్.. నాగార్జున-ప్రవీణ్ సత్తారు మూవీ ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో ఉంది