అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప మూవీలో విలన్ గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రాన్స్ , అనుకోని అతిథి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఫహద్ ఫాజిల్ పుష్పలో విలన్ అనగానే బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలే వచ్చాయి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద తగ్గేదే లే అన్నట్టుంటుంది. అలాంటింది బన్నీ-లెక్కల మాస్టారుతో పాటూ ఫహద్ ఫాజిల్ అనగానే సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి.






తాజాగా పుష్పరాజ్ తో ఢీ కొట్టబోతున్న IPS భన్వర్ సింగ్ షెకావత్ అంటూ ఫహద్ ఫస్ట్ లుక్  విడుదల చేసింది చిత్ర యూనిట్. గుండు మీద గాటుతో పోలీస్ స్టేషన్ లో టేబుల్ మీద చేతులు ఉంచి తీక్షణంగా చూస్తున్నాడు IPS భన్వర్ సింగ్. చూస్తుంటే తగ్గేదే లే అనే డైలాగ్ బన్నీతో పాటూ ఫహద్ కి కూడా వర్తిస్తుందేమో అన్నట్టుంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ - టీజర్ తో పాటూ దాక్కో దాక్కో మేక సాంగ్ సినిమాపై అంచనాలు పెంచాయనే చెప్పాలి.



'పుష్ప' మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది.  ప్రకాష్ రాజ్, జగపతిబాబు, ధనుంజయ్, అజయ్,  సునీల్, అనసూయ  కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుష్పకి సంగీత దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే 'పుష్ప-1' కు సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి అయింది. ముత్యంశెట్టి మీడియా తో కలసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.



అఖిల్-పూజాహెగ్డే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఖరారు


పుష్ప రిలీజ్ కాకముందే ఫహద్ కి టాలీవుడ్ లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పటికే స్టార్ హీరోలసినిమాలు వరుస ఆఫర్లొస్తున్నాయని సమాచారం. ఏదమైనా ఫుష్పలో IPS భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ విశ్వరూపం ఎలా ఉండబోతోందో చూడాలి.



Also Read: పవర్ స్టార్‌తో బుట్టబొమ్మ.. ఆ దర్శకుడితో మూడోసారి.. పూజా హెగ్డేకు గోల్డెన్ ఛాన్స్!


Also Read: గాయకుడు-నటుడు యోయో సింగ్ పై ఢిల్లీ కోర్టులో గృహహింస కేసు


Also Read: రక్తంతో తడిసిన కత్తి.. బ్లాక్ కలర్ లాంగ్ కోట్.. నాగార్జున-ప్రవీణ్ సత్తారు మూవీ ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో ఉంది


Also Read: దసరాకి థియేటర్లలో మహాసముద్రం..గన్ తో ఒకర్నొకరు బెదిరించుకుంటున్న శర్వానంద్-సిద్దార్థ్