అక్కినేని అఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. కెరీర్ ఆరంభంలో చేసిన మూడు సినిమాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. అయినప్పటికి అక్కినేని కుర్రాడు ఎక్కడా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ఫెయిల్యూర్స్  నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్న అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్  బ్యాచిలర్`కి కమిటయ్యాడు. మంచి ప్రేమకథ కావడంతో మొదటి మూడు చిత్రాల ఫెయిల్యూర్స్‌ను ఈ సినిమా ఘన విజయంతో తుడిచిపెట్టేస్తా అంటున్నాడు. ఈ మేరకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.






షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలయ్యే సమయంలో కరోనా ప్రభావంతో వాయిదా పడక తప్పలేదు. కరోనా కారణంగా చాలా సినిమాలు షూటింగులు వాయిదా పడడంతో ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్స్ కూడా మారుతూ వచ్చాయి. అక్టోబర్ 13న రావాల్సిన రాజమౌళి మల్టీ స్టారర్ ‘ఆర్.ఆ.ర్ఆర్’ వాయిదా పడుతుందన్న సమాచారం వల్లో ఏమో కానీ మోస్ట్ ‘ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా అక్టోబర్ 8న విడుదల చేస్తున్నామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్లో ప్రమోషన్ ప్రారంభించి దసరాకి థియేటర్లలో సందడి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నఈ సినిమాలో అఖిల్ హర్ష అనే ఎన్ఆర్ఐ పాత్రలో, పూజా హెగ్డే మాత్రం విభా అనే పాత్రలో నటించబోతోంది. ఈషా రెబ్బ, మురళి శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాష్, ప్రగతి, ఆమని కీలకపాత్రలు పోషిస్తున్నారు.



సంక్రాంతికి ఇప్పటికే స్లాట్స్ ఫుల్ అయిపోయాయి. ఇదే అదనుగా చాలా సినిమాలు దసరా బరిలో దిగేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే శర్వానంద్-సిద్దార్థ్ ‘మహాసముద్రం’ అక్టోబర్ 14న విడుదలవుతోంది. అందుకు ఆరు రోజుల ముందే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ థియేటర్లలో సందడి చేస్తోందన్నమాట. మరి వరుస మూడు సినిమాలతో పెద్దగా ఫలితం దక్కించుకోలేని అఖిల్ ఈ మూవీతో అదిరిపోయే హిట్టందుకుంటాడేమో చూడాలి.


Also Read: పవర్ స్టార్‌తో బుట్టబొమ్మ.. ఆ దర్శకుడితో మూడోసారి.. పూజా హెగ్డేకు గోల్డెన్ ఛాన్స్!


Also Read: గాయకుడు-నటుడు యోయో సింగ్ పై ఢిల్లీ కోర్టులో గృహహింస కేసు


Also Read: రక్తంతో తడిసిన కత్తి.. బ్లాక్ కలర్ లాంగ్ కోట్.. నాగార్జున-ప్రవీణ్ సత్తారు మూవీ ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో ఉంది


Also Read: దసరాకి థియేటర్లలో మహాసముద్రం..గన్ తో ఒకర్నొకరు బెదిరించుకుంటున్న శర్వానంద్-సిద్దార్థ్