చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు చేసిన పిచ్చి పనులకు కోర్టు ఆయనకు సంచలన శిక్ష విధించింది. ఏకంగా 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష వేసింది. ఇంతకీ ఆ ఉపాధ్యాయుడు చేసిన పనులేంటో తెలుసా? స్కూలుకు వచ్చిన ఆడ పిల్లల్ని లైంగికంగా వేధించడం. తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
Also Read: KCR: కేసీఆర్ చేతిలో చిన్నారి పేరుకు ఓ స్టోరీ ఉంది.. ఏంటో తెలుసా?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొడ్డా సునీల్‌కుమార్ అనే వ్యక్తికి కోర్టు ఈ శిక్ష విధించించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఈ దొడ్డా సునీల్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి పని చేస్తున్నారు. గతేడాది కరోనా వైరస్ వ్యాప్తి వల్ల స్కూళ్లన్నీ మూతపడిపోవడంతో ఆ సమయంలో చదువు చెప్తానని కొంత మంది బాలికలను తరచూ పాఠశాలకు రప్పించేవాడు. ఈ క్రమంలోనే అతను వారిపై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దాదాపు ఐదుగురు బాలికలు వారి తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో వారు గత డిసెంబరు 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మరుసటి రోజే నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడ్ని అరెస్టు చేశారు. శుక్రవారం కొత్తగూడెం పోక్సో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజరపర్చగా న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ విచారణ జరిపి సంచలన తీర్పు వెల్లడించారు. నిందితుడు దొడ్డా సునీల్ కుమార్‌కు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.11 వేల జరిమానా కూడా విధించారు.
Also Read: Theenmaar Mallanna: తీన్మార్ మల్లన్న అరెస్టు.. ఓ జ్యోతిష్యుడి ఫిర్యాదు వల్లే.. అసలేం జరిగిందంటే..
Also Read: Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన వెండి, తాజా ధరలివే..