తెలుగు రాష్ట్రల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు తెలిపాయి. ఉపరితల ఆవర్తనం, తక్కువ ఎత్తులో నైరుతి గాలులు విస్తరణ వల్ల వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నాయి. 


ఏపీలో వర్షాలు 


పశ్చిమ బంగాల్ కోస్తా తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ఉదయం పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. 


Also Read: Horoscope Today : ఈ రాశులవారు అవసరమైన వారికి సహాయం చేస్తారు... వాళ్లు మాత్రం ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి


కోస్తా ఆంధ్రాలో 


ఉపరితల ఆవర్తనం ప్రభావం వలన ఏపీలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు కోస్తా ఆంధ్రాలో చాలా చోట్ల ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 


రాయలసీమలో 


రాయలసీమలో శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 


Also Read: Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన వెండి, తాజా ధరలివే..


తెలంగాణలో వర్షాలు


తెలంగాణలో శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉందని పేర్కొంది. 


Also Read: Theenmaar Mallanna: తీన్మార్ మల్లన్న అరెస్టు.. ఓ జ్యోతిష్యుడి ఫిర్యాదు వల్లే.. అసలేం జరిగిందంటే..