రియల్ హీరో సోనుసూద్.. ఈసారి కూరగాయల బండితో ప్రత్యక్షమయ్యారు. అదేంటీ.. ఎవరికైనా సాయం చేడానికి ఆయన కూరగాయలు అమ్ముతున్నారా? అనేగా మీ సందేహం? కానే కాదు. కానీ, అలాంటిదే. ఇది కూడా ఒకరకంగా సాయం చేయడమే. సామాన్యులకు కష్టం వస్తే.. నేనున్నా అని అభయ హస్తం ఇచ్చే సోనుసోద్.. తన వద్దకు వచ్చేవారికే కాదు.. తనకు కంటికి కనిపించే పేదలకు కూడా అడగకుండా సాయం చేస్తున్నారు. రోజూ తన ఇంటి ముందు నుంచి కూరగాయలను అమ్ముకుంటూ వెళ్లే సబ్జీవాలాను చూసి సోనుసూద్ మనసు కరిగింది. నిత్యం తాజా కూరగాయాలను వీధి వీధికి విక్రయిస్తున్న ఆ యువకులు సోనుకు బాగా నచ్చేశారు. దీంతో వారి బండిని ఆపి కాసేపు కబుర్లు చెప్పారు.
బండిలో ఉన్న కూరగాయలు, వాటి ధరలు గురించి సోనుసూద్ తెలుసుకున్నారు. వారు పడుతున్న కష్టం గురించి తెలుసుకుని చలించిపోయారు. వారిద్దరు తన తల్లిదండ్రులను పోషించడం కోసం కూరగాయల బండిని నడుపుతున్నామని చెప్పడంతో సోనుకు మరింత నచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వీళ్లు నిత్యం తాజా కూరగాయలను ఎక్కడో మార్కెట్లో కొనుగోలు చేసి వీధుల్లోకి తీసుకొచ్చి అమ్ముతుంటారు. వారి కష్టాన్ని గౌరవించి.. దయచేసి వారితో బేరాలు ఆడవద్దు’’ అని సోను కోరారు. ఇలా బండి మీద కూరగాయలు అమ్మేవారి వద్ద కొనుగోలు చేస్తే చిన్న వ్యాపారులకు సాయం చేసినట్లు ఉంటుందని సోను అన్నారు. ఈ వీడియోను ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి మరీ అభిమానులను రిక్వెస్టు చేశారు సోను. ‘‘తాజా కూరగాయలను ఉచితంగా డోర్ డేలివరీ చేసేందుకు నాకు ఆర్డర్ చేయండి’’ అని ట్విట్‌లో పేర్కొన్నారు. సోను సూద్ ట్వీట్‌ను ఇక్కడ చూసేయండి.
Also Read: ‘3 రోజెస్’ టీజర్.. పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ షో.. తాలిబన్లను తిడుతున్న పూర్ణ!
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
Also Read: బాబోయ్ ‘స్కైలాబ్’.. అందరి కళ్లు ఆకాశం వైపు.. 1979లో కరీంనగర్‌లో ఏం జరిగింది?
Also Read: 'జై భీమ్' చూశాక 37 ఏళ్లు వెనక్కి వెళ్లా... ఆమె నా కళ్లల్లో మెదిలింది - సీపీఐ నారాయణ