స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల వాళ్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' లాంటి భారీ సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో ఈ ఏడాదికి ఇక ఆశలన్నీ 'పుష్ప' మీదే ఉన్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ను 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
Also Read: బాలయ్య షోతో 'ఆహా'కి ఎన్ని బెనిఫిట్సో..
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మూడు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూడు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 'చూపే బంగారమాయనే' అనే పాత యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో మంగళం శ్రీను అనే పాత్రలో నటుడు సునీల్ కనిపించబోతున్నారని.. రేపు ఉదయం 10:08 నిమిషాలకు సునీల్ పాత్రను రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా హిందీ రిలీజ్ చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. ముందుగానే డబ్బింగ్ హక్కులు అమ్మేయడంతో ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కి సమస్యలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఇష్యూని పరిష్కరించడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
Also Read: మెగా 154 లాంఛింగ్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు..