ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఏపీలో అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతం పాపికొండలు. అయితే కొంతకాలంగా పాపికొండలు యాత్ర నిలిచిపోయింది. ఇప్పుడు గోదావరి నదిలో బోటు షికారు చేయాలనుకునే వారికి.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం నుంచి బోటింగ్ ప్రారంభం కానుంది. టూరిజం, పోలీసులు అధికారులతో కలెక్టర్ హరి కిరణ్ సమావేశం నిర్వహించారు. బోటు ఆపరేటర్లు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాత్రికుల భద్రత, బోట్ టూర్ ఆపరేటర్లు, ఫెర్రీ ఆపరేటర్లు పాటించవలసిన నిబంధనల గురించి కలెక్టర్ వివరించారు.
కలెక్టర్ హరికిరణ్ ఆదేశాలకు అనుగుణంగా.. శనివారం ట్రయల్ వేశారు. యాత్రకు పేరంటాలపల్లి స్థానిక లాంచీల రేవు నుండి బయలుదేరి వెళ్లాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గొందూరు మాతృశ్రీ గండి పోశమ్మ అమ్మవారి టెంపుల్ నుండి విహారయాత్ర ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక ఆపరేషన్ నిబంధనలు పై విశ్వసనీయతను పెంపొందించే దిశగా డ్రై రన్ ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తెలిపారు. పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు.
బోట్లలో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ ఉండాలని పరిమితికి మించి బోట్లలో ఎక్కించుకోకుడదని.. జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ చెప్పారు. బోట్లో వెళ్లేటప్పుడు లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. నిబంధనలు పాటించని బోటు యాజమనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బోట్ల లైసెన్సులు.. రద్దు చేస్తామన్నారు. కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత దాదాపు రెండేళ్ల అనంతరం ఈ యాత్ర ప్రారంభం కానుంది. గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
పాపికొండలు టూర్ కోసం పర్యాటక శాఖ పలు ప్యాకేజీలు అమలు చేస్తోంది. ఇందులో ఒకరోజు, రెండు రోజులకు ప్రత్యేకమైన ప్యాకేజీలు ఉంటాయి. ఆన్ లైన్లో www.papikondalu.in వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
Also Read: AP Power Politics : ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?
Also Read: PapiKondalu: విషాదాన్ని దాటి ప్రారంభమైన పాపికొండల యాత్ర
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి