Mahesh Babu's Sarkaru Vaari Paata available on Amazon Prime Video OTT - Pay Per View Model: సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షకులకు అందుబాటులో ఉంది. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ప్రైమ్ వీడియో స‌బ్‌స్క్రిప్ష‌న్‌ ఉన్నా సరే... సినిమా చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే.


'సర్కారు వారి పాట' సినిమా వీక్షించడానికి 199 రూపాయలు అదనంగా చెల్లించాలి. పే పర్ వ్యూ పద్ధతిలో సినిమాను విడుదల చేశారు. ఫ్రీగా మహేష్ బాబు సినిమా చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.


'సర్కారు వారి పాట'లో 'మురారి' సాంగ్ యాడ్ చేశామని చిత్ర బృందం వెల్లడించిన తర్వాత రోజు ఓటీటీలో సినిమా విడుదల కావడం విశేషం. థియేటర్లకు ఆ పాట కోసం కొంత మంది ప్రేక్షకులైనా వస్తారని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పుడు ఓటీటీలో సినిమా రావడంతో థియేటర్ల దగ్గర స్పందన ఎలా ఉంటుందో చూడాలి.


Also Read: '9 అవర్స్' రివ్యూ: వెబ్ సిరీస్ చూశాక ఆ ఒక్క ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది


మే 12న 'సర్కారు వారి పాట' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. పరశురామ్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు.


Also Read: రామ రావణుడిగా సాయిరామ్ శంకర్ - రవితేజ విడుదల చేసిన 'ఒక పథకం ప్రకారం' టీజర్ చూశారా?