పూరి జగన్నాథ్ తమ్ముడు, యువ కథానాయకుడు సాయిరామ్ శంకర్ (Sai Raam Shankar) నటించిన సినిమా 'ఒక పథకం ప్రకారం'. ఇందులో ఆషిమా నర్వాల్ కథానాయిక. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి జాతీయ పురస్కార గ్రహీత వినోద్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నారు.


'ఒక పథకం ప్రకారం' టీజర్‌ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. సాయిరామ్ శంకర్‌కు 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. సినిమా కాన్సెప్ట్ ఏంటనేది టీజర్‌లో వెల్లడించారు. జూన్ 24న ఈ సినిమాను విడుదల (Oka Pathakam Prakaram Movie Release Date) చేయనున్నట్లు దర్శక - నిర్మాతలు వెల్లడించారు.
  
'ఒక పథకం ప్రకారం' సినిమాలో రామ రావణ తరహా పాత్రలో సాయిరామ్ శంకర్ నటిస్తున్నారని దర్శకుడు వినోద్ విజయన్ తెలిపారు. ఆయనతో పాటు మరో ఐదుగురు జాతీయ పురస్కార గ్రహీతలు ఈ చిత్రాన్ని పని చేశారు.


Also Read: '9 అవర్స్' రివ్యూ: వెబ్ సిరీస్ చూశాక ఆ ఒక్క ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది






'పటాస్' ఫేమ్ శృతి సోది, సముద్రఖని, కళాభవన్ మణి, రవి పచ్చముత్తు, భాను శ్రీ, పల్లవి గౌడ తదితరులు నటించిన ఈ చిత్రానికి వినోద్ విజయన్, రవి పచ్చముత్తు, గార్లపాటి రమేష్ నిర్మాతలు. రాహుల్ రాజ్ స్వరాలు, గోపీసుందర్ నేపథ్య సంగీతం అందించారు.


Also Read: కమల్ సినిమాకూ రేట్లు తగ్గించారు - ఇకనుంచి ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారా?