IIFA 2022: ఐఫాలో 'పుష్ప: ది రైజ్' ఫీవర్ - సినిమాలో హిట్ పాటలకు దేవిశ్రీ పెర్ఫార్మన్స్

హిందీలోనూ 'పుష్ప' హిట్ అయ్యింది. ఉత్తరాదిలోనూ 'పుష్ప' పాటలు బాగా వినిపించాయి. ఇప్పుడు ఐఫా వేడుకలోనూ ఆ పాటలు సందడి చేయనున్నాయి

Continues below advertisement

బాలీవుడ్ ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ కోసం రెడీ అయ్యింది. ఆల్రెడీ చాలా మంది బీటౌన్ సెలబ్రిటీలు అబు దాబి చేరుకున్నారు. ఈ రోజు (జూన్ 2) నుంచి జూన్ 4 వరకు... రెండు రోజుల పాటు అబు దాబిలో అవార్డు వేడుక జరగనుంది. దీనికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయనున్నారు. 

Continues below advertisement

ఐఫా 2022 (IIFA 2022) స్పెషాలిటీ ఏంటంటే... సౌతిండియా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, హిందీలో కూడా కొన్ని హిట్ సాంగ్స్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. అదీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ 'పుష్ప: ది రైజ్'లో పాటలకు! ఆ సినిమా హిందీ వెర్షన్ కూడా హిట్ అయ్యింది. ఉత్తరాది ప్రేక్షకులకు 'పుష్ప' పాటలు బాగా నచ్చాయి. ఉత్తరాదిలో బాగా వినిపించాయి. అందులోని 'ఊ అంటావా... ఊఊ అంటావా...', 'శ్రీవల్లి...' పాటలకు ఐఫాలో దేవి శ్రీ ప్రసాద్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నట్టు తెలిసింది. 

Also Read: '9 అవర్స్' రివ్యూ: వెబ్ సిరీస్ చూశాక ఆ ఒక్క ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది

గత ఏడాది డిసెంబర్‌లో 'పుష్ప: ది రైజ్' విడుదల అయ్యింది. త్వరలో సీక్వెల్ 'పుష్ప: ది రూల్'ను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించారు.

Also Read: కమల్ సినిమాకూ రేట్లు తగ్గించారు - ఇకనుంచి ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారా?

Continues below advertisement
Sponsored Links by Taboola