Corona Cases: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 3,712 కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు. కొత్తగా 2500 మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతానికి చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 0.84 శాతానికి పెరిగింది.
- మొత్తం కరోనా కేసులు: 4,31,64,544
- మొత్తం మరణాలు: 5,24,641
- యాక్టివ్ కేసులు: 19,509
- రికవరీల సంఖ్య: 4,26,20,394
మహారాష్ట్రలో
దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు వెలుగుచూశాయి. బుధవారం ఒక్కరోజే 1081 మందికి వైరస్ సోకింది. గత మూడు నెలల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం.
వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా తాజాగా 12,44,298 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,93,70,51,104కు చేరింది. ఒక్కరోజే 4,41,989 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ 19 వ్యాక్సిన్ డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు, మూడో డోసుకు మధ్య కాల వ్యవధిని 9 నెలల నుంచి 90 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొవిన్ యాప్ (COWIN App)లో మార్పులు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
బీఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేట్ & ప్రభుత్వ టీకా కేంద్రాలకు వ్యాక్సిన్ కోసం ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అంతర్జాతీయ ప్రయాణం చేయాల్సిన వ్యక్తులకు మాత్రమే కరోనా వ్యాక్సిన్ రెండు, మూడు డోసుల మధ్య తగ్గించిన గ్యాప్ టైమ్ వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది.
Also Read: UPSC 2021: 10 ఏళ్లు, 6 ప్రయత్నాలు, 11 మార్కులతో ఛాన్స్ మిస్- కానీ తగ్గేదేలే అంటూ ట్వీట్
Also Read: UPSC 2021: ఎంత పనిచేశారు భయ్యా! ఐశ్వర్య అంటే అమ్మాయ్ అనుకున్నాంగా!