UPSC 2021: యూపీఎస్సీ 2021 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అయితే సివిల్స్ నాలుగో ర్యాంకర్ విషయంలో తీవ్ర గందరగోళం చెలరేగింది. నాలుగో ర్యాంకర్ పేరు ఐశ్వర్య వర్మ కావడంతో అందరూ అమ్మాయి అనుకున్నారు. పలు పత్రికలు, వెబ్‌సైట్లు కూడా అలానే వార్తలు ఇచ్చాయి.
తొలి మూడు ర్యాంకులూ మహిళలే కైవసం చేసుకోవడంతో నాలుగో ర్యాంకర్ పేరు చూసి ఐశ్వర్య అంటే అమ్మాయేనని చాలామంది అనుకున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్టులు వెల్లువెత్తాయి. దీంతో ఐశ్వర్య కుటుంబసభ్యులు కంగుతిన్నారు.
అమ్మాయి కాదు
ఐశ్వర్య మహిళ కాదంటూ ఆయన కుటుంబీకులు, స్నేహితులు చివరికి స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆయన ఫొటో పెట్టి మరీ విషయం వివరించారు. ఐశ్వర్య వర్మ దిల్లీలో నాలుగేళ్ల పాటు కోచింగ్ తీసుకుని, నాలుగో ప్రయత్నంలో నాలుగో ర్యాంకు సాధించారు.
సీఎం క్లారిటీ
ఈ విషయంలో చాలా మందికి గందరగోళం ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం చాలా క్లారిటీగా ప్రశంసించారు. "ఉజ్జయినికి చెందిన పురుష అభ్యర్థి ఐశ్వర్య వర్మ యూపీఎస్సీలో నాలుగో ర్యాంకు సాధించారు" అంటూ స్పష్టంగా పేర్కొన్నారు.
ఫలితాలు
సివిల్స్- 2021 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాల్లో శృతి శర్మ టాపర్‌గా నిలిచారు. 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ. అంకితా అగర్వాల్ రెండో ర్యాంక్, గామిని సింగ్లా 3వ ర్యాంక్, ఐశ్వర్య వర్మ 4వ ర్యాంకు, ఉత్కర్ష్ ద్వివేది 5వ ర్యాంక్ సాధించారు. సివిల్ సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు సత్తా చాటారు. టాప్-5లో ముగ్గురు అమ్మాయిలే కావడం విశేషం.
జనరల్ కోటాలో 244, ఈడబ్ల్యూఎస్ 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఎంపికయ్యారు. ఐఏఎస్‌కు 180 మంది, ఐపీఎస్‌కు 200 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరీకి 242 మంది, 90 మంది గ్రూప్ బీ సర్వీసులకు ఎంపికయ్యారు.
తెలుగువాళ్లు
- యశ్వంత్ కుమార్ రెడ్డి- 15వ ర్యాంక్
- పూసపాటి సాహిత్య- 24వ ర్యాంక్
- శృతి రాజ్యలక్ష్మి- 25వ ర్యాంక్
- రవి కుమార్-38వ ర్యాంక్
- కొప్పిశెట్టి కిరణ్మయి- 56వ ర్యాంక్
- పాణిగ్రహి కార్తీక్- 63వ ర్యాంక్
- సుధీర్ కుమార్ రెడ్డి- 69వ ర్యాంక్
- శైలజ- 83వ ర్యాంక్
- శివానందం- 87వ ర్యాంక్
- ఆకునూరి నరేశ్- 117వ ర్యాంక్
- అరుగుల స్నేహ- 136వ ర్యాంక్
- గడిగె వినయ్‌కుమార్- 151వ ర్యాంక్
- దివ్యాన్షు శుక్లా- 153వ ర్యాంక్
- కన్నెధార మనోజ్‌కుమార్- 157వ ర్యాంక్
- బి చైతన్య రెడ్డి- 161వ ర్యాంక్
- దొంతుల జీనత్ చంద్ర- 201వ ర్యాంక్
- సాస్యరెడ్డి- 214వ ర్యాంక్
- కమలేశ్వర్‌రావు- 297వ ర్యాంక్
- నల్లమోతు బాలకృష్ణ- 420వ ర్యాంక్
- ఉప్పులూరి చైతన్య- 470వ ర్యాంక్
- మన్యాల అనిరుధ్- 564వ ర్యాంక్
- బిడ్డి అఖిల్- 566వ ర్యాంక్
- రంజిత్‌కుమార్- 574వ ర్యాంక్
- పాండు విల్సన్- 602వ ర్యాంక్
- బాణావత్ అరవింద్- 623వ ర్యాంక్
- బచ్చు స్మరణ్‌రాజ్- 676వ ర్యాంక్
Also Read: Hurricane Agatha: మెక్సికోలో 'అగాథ' హరికేన్ బీభత్సం- 10 మంది మృతి
Also Read: Ram Mandir Ayodhya: చకచకా అయోధ్య రామమందిర నిర్మాణం- గర్భగుడి పనులకు యోగి శంకుస్థాపన