ABP  WhatsApp

ED Summons Sonia Gandhi: సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ షాక్- ఆ కేసులో సమన్లు జారీ

ABP Desam Updated at: 01 Jun 2022 03:01 PM (IST)
Edited By: Murali Krishna

ED Summons Sonia Gandhi: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ షాక్- ఆ కేసులో సమన్లు జారీ

NEXT PREV

ED Summons Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ షాకిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇద్దరికీ ఈడీ సమన్లు జారీ చేసింది.






నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో విచారణ కోసం ఈనెల 8న సోనియాను హాజరుకావాలని ఈడీ నోటీసులో సూచించింది. అయితే రాహుల్ గాంధీని మాత్రం కాస్త ముందుగా హాజరు కావాలని కోరినట్లు సమాచారం. 


కాంగ్రెస్ రియాక్షన్


సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. అయితే ఈ విచారణకు సోనియా గాంధీ హాజరై అన్ని వివరాలు అందిస్తారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. 



1942లో మొదలైన నేషనల్ హెరాల్డ్ పత్రికను అప్పటి బ్రిటీష్ పాలకులు అణిచివేయాలని చూశారు. ఇప్పుడు మోదీ సర్కార్ కూడా అదే చేస్తోంది. ఇందుకోసం ఈడీని ఉపయోగిస్తోంది సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. దీనిని ఓ పిరికిపంద చర్యగా భావిస్తున్నాం.                                                                            - రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ నేత


ఇదీ కేసు


కాంగ్రెస్ పార్టీ, గాంధీలతో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ కేసు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ) తమ అధీనంలోకి తెచ్చుకోవడం వెనుక మోసం, కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఏజేఎల్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) కంపెనీ దానిని టేకోవర్ చేసింది. దానికి డైరెక్టర్లుగా ఉన్న సుమన్ దుబే, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడాలకు గాంధీ విధేయులుగా పేరుంది.


ఈ కేసుపై సుబ్రహ్మణ్య స్వామి దిల్లీ హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కాంగ్రెస్‌ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఇందులో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ సహా ఏడుగురిని పేర్లను చేర్చారు. వీరిలో ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా‌ తదితరులు ఉన్నారు. 


Also Read: Tamil Nadu: ఒకేరోజు 5,200 మంది ఉద్యోగులు రిటైర్- ఆ రాష్ట్రంలో భారీగా ఖాళీలు!


Also Read: Lakhimpur Kheri Violence Case: లఖింపుర్ ఖేరీ కేసులో కీలక సాక్షిపై కాల్పులు


                                                                      


 

Published at: 01 Jun 2022 01:54 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.