Tamil Nadu: తమిళనాడులో ఒక్కరోజులో 5,200 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీవిరమణ పొందారు. మే 31న వీరు రిటైర్ అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 15 వేలకు చేరనున్నట్లు సమాచారం. తమిళనాడులో మొత్తం 15 లక్షల మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఉన్నారు. 







వయసు పెంపు


2020లో కరోనా మహమ్మారి పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును అరవై ఏళ్ళకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 2020లో పదవీ విరమణ చేయాల్సిన వారు మరో రెండేళ్లపాటు సర్వీసులో కొనసాగారు.


రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ, స్థానిక పరిపాలన శాఖ సహా పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుమారు 5,200 మంది మంగళవారం రిటైర్ అయ్యారు. పదవీ విరమణ వయస్సును అరవైయేళ్ళకు పెంచిన తర్వాత తొలిసారిగా ఇంతమంది ఒకే రోజు పదవీ విరమణ చేయడం విశేషం.


భారీగా ఖాళీలు


ప్రస్తుతం పదవీ విరమణ చేసినవారందరికీ గ్రాట్యుటీ, పింఛన్‌కోసం ఐదు నుంచి ఎనిమిది వేల కోట్ల మేరకు నిధులు కేటాయించినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో 1.50 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి జాబితాలో తాజాగా ఇవి కూడా చేరాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి తగు సన్నాహాలు జరుగుతున్నాయి.


మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ కొలువు కోసం శ్రమిస్తున్న తమ గురించి ప్రభుత్వం ఆలోచించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: Lakhimpur Kheri Violence Case: లఖింపుర్ ఖేరీ కేసులో కీలక సాక్షిపై కాల్పులు


Also Read: Coronavirus Update India: దేశంలో కొత్తగా 2,745 కరోనా కేసులు- ఆరుగురు మృతి