Hurricane Agatha: మెక్సికోలో 'అగాథ' హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. తుపాను వల్ల కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా 10 మంది మరణించారు. భారీ వర్షాల వల్ల వరదలు సంభవించడంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో పరిస్థితి దారుణంగా ఉంది. హరికేన్ వల్ల గంటకు 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.






బీభత్సం






వర్షాలు వరదల ధాటికి 10 మంది మరణించగా, మరో 20 మంది తప్పిపోయారని మెక్సికో అధికారులు చెప్పారు. ఈ తుపాను ప్రభావం వల్ల వెరాక్రూజ్ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురవడంతో లోతట్టుప్రాంతాలు వరదనీటిలో మునిగాయి.


తప్పిపోయిన 20 మంది కోసం గాలిస్తున్నామని ఓక్సాకా రాష్ట్ర గవర్నర్ అలెజాండ్రో మురాత్ చెప్పారు. భారీ వర్షాల వల్ల నదులు పొంగి ప్రవహించాయి. శాంటా కాటరినా క్సానాగుయా కమ్యూనిటీలో కొండ భాగం కూలిపోవడంతో 18-21 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు వ్యక్తులు మరణించారని ఓక్సాకా పౌర రక్షణ కార్యాలయం తెలిపింది. 


తూర్పు పసిఫిక్​ ప్రాంతంలో మే నెలలో వచ్చిన అతిపెద్ద తుపానుగా ఇది రికార్డైంది. గంటకు 165 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెను గాలులు, భారీ వర్షాల ధాటికి మెక్సికో దక్షిణ ప్రాంతంలోని తీర ప్రాంత పట్టణాలు వణికిపోతున్నాయి.


Also Read: Ram Mandir Ayodhya: చకచకా అయోధ్య రామమందిర నిర్మాణం- గర్భగుడి పనులకు యోగి శంకుస్థాపన


Also Read: ED Summons Sonia Gandhi: సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ షాక్- ఆ కేసులో సమన్లు జారీ