బ్యాన్ క్రాకర్స్ అనే నినాదం ఊపందుకుంటోంది. నిర్ణీత సమయంలోనే టపాసులు కాల్చాలని కొన్ని చోట్లు నిబంధనలు కూడా విధించారు. అయితే టపాసులను కాల్చడం ఆపాలి అనే విషయంపై ఇషా ఫౌండేషన్ స్థాపకులు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ తనదైన శైలీలో బదులిచ్చారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ మాటల్ని సమర్థించిన సమంత ఈ మేరకు ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.
జగ్గీ వాసుదేవ్ ఏమన్నారంటే “కొన్నేళ్లుగా నేను టపాసులు కాల్చడం లేదు.. కానీ నా చిన్నప్పుడు ఈ వెలుగుల పండుగ అంటే ఎంతో ప్రత్యేకం. సెప్టెంబర్ నుంచి దీపావళి రోజు టపాసులు పేల్చోచ్చని కలలు కనేవాళ్లం.. పండగ అయిపోయినా సరే .. ఆ టపాసులను దాచుకుని మరో రెండు నెలలు రోజూ కాల్చేవాళ్లం. పర్యావరణ పరంగా చురుగ్గా ఉండే వ్యక్తులెవరూ పిల్లలను క్రాకర్స్ కాల్చకూడదని అనకూడదు.. ఇది మంచి పద్దతి కాదు.. టపాసులు, బాణాసంచా కాల్చే ఆనందాన్ని అనుభవించకుండా ఉండేందుకు వాయు కాలుష్యంపై ఆందోళన ఒక కారణం కాకూడదు. వాయికాలుష్యం పై ఆందోళ చెందుతున్న వారికి నేను ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సూచిస్తున్నాను. ఈసారికి మీరు టపాసులు కాల్చడం మానేసి.. మీ పిల్లలను కాల్చనివ్వండి. అంతేకాదు.. మీ ఆఫీసుకు కారులో కాకుండా. మూడు రోజులు నడిచి వెళ్లండి..” అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ మాటల్ని సమర్థించింది సమంత. సద్గురు మాట్లాడిన మాటలను తన ఇన్స్టా స్టోరీల పోస్ట్ చేస్తూ డోంట్ బ్యాన్ క్రాకర్స్ అంటూ కామెంట్ చేసింది.
గత కొద్ది రోజులుగా సమంత సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్గా ఉంటోంది సమంత. తన పర్సనల్ విషయాలతోపాటు.. ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ అభిప్రాయాలను తెలియజేస్తోంది. ఇంట్రెస్టింగ్ కోట్స్ షేర్ చేస్తోంది. ప్రస్తుతానికి తన కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించిన సమంత తన వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరింత బిజీ అయిపోతోంది.
Also Read: దీపావళి రోజు లక్ష్మీ పూజా ఇలా చేసుకోండి…
Also Read: శనిదోషం పోవాలంటే దీపావళి రోజు ఇలా చేయండి...
Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
Also Read: ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
Also Read: ఆ దీపాల వెలుగుల వెనుక ఇంత అర్థం ఉందా, దీపం పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి...
Also Read: యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: దీపావళి రోజున చీపురు కొంటే సిరిసంపదలు కలిసొస్తాయిట... దానం చేసినా చాలా మంచిదంటున్న పండితులు
Also Read:అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి